నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పేదింటి విద్యార్ధులకు ప్రతీయేట స్కాలర్ షిప్ లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది తొలిసారిగా యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహించేందుకు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మొదటిసారిగా యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ రాజేంద్రకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్‌సీ …
Read More »టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం
టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యదగిరి గుట్ట పవిత్రత కాపాడేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధివిధానాల రూపకల్పన చేయాలని అన్నారు. ఈ మేరకు బుధవారం తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో, ధర్మకర్తల మండలి (యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డు) ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాకు పలు సవరణలను సీఎం ప్రతిపాదించారు..తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తరహాలోనే యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి …
Read More »తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ ఉపసంహరణకు ఫిబ్రవరి 13 చివరి తేదీగా ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, …
Read More »మృత్యు లారీలు.. హైదరాబాద్‌లో హెవీ వెహికిల్స్ ఎంట్రీపై టీవీ9 ఎఫెక్ట్.. పోలీసుల అలర్ట్..
షేక్‌పేట్ రోడ్డుప్రమాద ఘటనతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. నో ఎంట్రీ సమయం తర్వాత సిటీలోకి వస్తున్న భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కొరఢా ఝుళిపిస్తున్నారు. పంజాగుట్ట సర్కిల్‌లో తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, వాటర్ ట్యాంకర్స్, మినీ లోడ్ వాహనాలపై ఫైన్‌లు విధించారు.ప్రజల ప్రాణాలంటే వేళాకోలంగా ఉందా?…లారీలను, హెవీ వెహికల్స్‌ను వేళాపాళాలేకుండా సిటీలోకి ఎలా అనుమతిస్తున్నారు? నో ఎంట్రీ నిబంధనలు తుంగలో తొక్కుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? నో ఎంట్రీ టైమ్‌లో సిటీలోకి దూసుకొచ్చిన లారీ …
Read More »ఇంటర్ బోర్డు పైత్యం.. పరీక్షలకు ముందు ఇంటర్ ప్రశ్నపత్రంలో మార్పులేంది సామీ..?
ఒకవైపు పరీక్షలు సమీపిస్తుంటే విద్యార్ధుల్లో ఒత్తిడి నానాటికీ పెరిగిపోతుంది. రాత్రింబగళ్లు కష్టపడి చదువుతున్నారు. ఇలాంటి క్లిష్టసమయంలో ఇంటర్ బోర్డు వింత ప్రకటన జారీ చేసింది. ఉన్నట్లుండి ఇంటర్ లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అటు ఉపాధ్యాయులతోపాటు ఇటు విద్యార్ధులు అంతా గందరగోళంలో పడిపోయారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యార్ధులు ముమ్మరంగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యా సంవత్సరం దాదాపు ముగింపుకు వచ్చిన …
Read More »నాగోరే నాగోబా.. దారులన్నీ కేస్లాపూర్ వైపే.. మహా జాతరకు వేళాయే..
నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ పిలుస్తోంది. ప్రతి ఏటా పుష్యమి నెలవంక రెండో రోజున చెకడ పేరిట నిర్వహించే ప్రచారంతో నాగోబా జాతర తొలి ఘట్టానికి అంకురార్పణ జరుగుతుంది. గోదావరి జలాల సేకరణతో కీలక ఘట్టానికి చేరుకుని.. పుష్యమి అమవాస్య అర్ధరాత్రి జరిపే మహాపూజతో ప్రజ్వలితమవుతుంది. అంతటి ప్రాశస్త్యం కలిగిన నాగోబా జాతర ఇవాళ ప్రారంభం కాబోతోంది. జనవరి 28న మొదలై ఫిబ్రవరి 4వ తేదీ వరకు 8 రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర సాగనుంది.తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగే నాగోబా జాతరకు ఏర్పాట్లు …
Read More »తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. 21 డిమాండ్లతో నోటీస్
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. 21 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చారు కార్మికులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్మికులు. 2021 నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చాలని కోరారు. ఆర్టీసీని ప్రయివేట్ పరం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు కార్మికసంఘాల నేతలు. అద్దె …
Read More »గద్దర్‌ను హత్య చేశారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజా నౌక గద్దర్‌ది ముమ్మాటికి హత్య చేశారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. దీన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. గద్దర్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గద్దర్‌పై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైరయ్యారు.కిలారి ఆనంద్ పాల్.. షార్ట్‌గా కే ఏ పాల్. ఈ పేరు చెపితే తెలియని వారుండరు అనేంతలా పాతుకుపోయిన వ్యక్తి. నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్స్‌తో మీడియా దృష్టిని ఆకర్షిస్తూ …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
తెలంగాణలో అత్యంత సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు అరెస్ట్‌లు, దర్యాప్తులు, విచారణల తర్వాత- ఈ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది.. కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం నలుగురు అరెస్టయ్యారు.తెలంగాణలో అత్యంత సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు అరెస్ట్‌లు, దర్యాప్తులు, విచారణల తర్వాత- ఈ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు …
Read More »కిడ్నీ రాకెట్ అల్లాటప్పా కాదు.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు
కిడ్నీ రాకెట్‌లో అలకనంద ఆస్పత్రి వెనుక అంతులేని రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. లోకల్ గా ఏదో చోటా మోటా కేసుగా ముందు భావించినా..దీ నివెనుక భారీ కిడ్నీ రాకెట్ దాగుందని పోలీసులు అనుమానం. ఆస్పత్రి ముసుగులో ఓ భారీ కిడ్నీ దందాకు ఆముఠా తెరలేపినట్లు స్పష్టమవుతోంది. దొరికింది కొందరే. కానీ దొరకాల్సింది చాలా ఉందని పోలీసుల మాటల్లో అర్థమవుతోంది.తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఎల్బీనగర్ వేదికగా అలకనంద హాస్పిటల్‌లో గుట్టుగా సాగుతున్న కిడ్నీ మార్పిడి రాకెట్ …
Read More »