రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. సిక్రింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే సేవలు మళ్ల అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనుల కారణంగా దారి మళ్లించబడిన లేదా టెర్మినల్ మార్పులు చేయబడిన రైళ్లన్ని ఇకపై వాటి పాత మార్గాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తాయని స్పష్టం చేసింది. అలాగే కాచిగూడలో తాత్కాలికంగా ఆగుతున్న విజయవాడ-కాచిగూడ- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12713/12714) మరోసారి సికింద్రాబాద్ నుండి నడుస్తున్నట్టు పేర్కొంది. కొన్ని ట్రైన్స్ ఇప్పటికే ప్రారంభం కాగా మరికొన్ని ట్రైన్స్ సెప్టెంబర్ 9 …
Read More »అయ్యో దేవుడా.. గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి..
సైలెంట్ కిల్లర్.. గుండె పోటు కేసులు నానాటికి పెరుగుతున్నాయి.. ఒకప్పుడు గుండె సమస్యలు కేవలం పెద్దవారికి మాత్రమే వచ్చేవి అనుకునేవారు.. కానీ, ఇప్పుడు కాలం మారింది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. గుండెపోటు అందరి ప్రాణాలు తీస్తోంది.. చిన్న వయస్సు వారు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.. అప్పటివరకు సంతోషంగా తమతో గడిపిన వారు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రస్తుతం ఆందోళనకరంగా మారాయి.. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో జరిగిన వినాయక నిమజ్జనంలో.. డీజే మ్యూజిక్ కు డ్యాన్స్ …
Read More »హైదరాబాద్‌లో మాత్రమే దొరికే 5 రకాల వెరైటీ బిర్యానీలివి.. ఎక్కడంటే?
హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ అనేంతగా ఈ వంటకం మన సంస్కృతిలో భాగమైపోయింది. అయితే, ఎప్పటిలాగే దమ్ బిర్యానీ తిని బోర్ కొట్టిందా? మీరొక బిర్యానీ ప్రియులైతే, అన్ని రకాల బిర్యానీలు రుచి చూశానని అనుకుంటే పొరపాటే. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఫుడ్ మ్యాప్‌లో కొన్ని కొత్త, వినూత్నమైన బిర్యానీలు చేరాయి. సరికొత్త రుచులను ఆస్వాదించాలనుకునే వారికి ఈ ఐదు రకాల బిర్యానీలు ఒక మంచి ఎంపిక. బిర్యానీ.. ఇది కేవలం ఒక వంటకం కాదు, హైదరాబాదీల ప్రేమ, సంస్కృతి. తరతరాలుగా వస్తున్న …
Read More »ఏం జరగనుంది..? సడెన్‌గా ఆ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
ఒక్కరు.. ఒకే ఒక్కరు తప్పా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కడియం శ్రీహరి మినహా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి కూడా హాజరయ్యారన్న సమాచారంతో అసలేం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై …
Read More »తెలంగాణ దసరా సెలవుల లిస్ట్ వచ్చేసింది.. అబ్బో.. ఇన్ని రోజులా..?
తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త. ఈ ఏడాది దసరా పండగ సెలవుల లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించింది విద్యాశాఖ. ప్రతి ఏడాది మాదిరిగానే.. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా కలిసి రానుండటంతో విద్యార్థులకు వరుసగా సెలవులు ఇచ్చారు. ఆ డేట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. అక్టోబర్ 4నుంచి తిరిగి సాధారణ తరగతులు పునప్రారంభం కానున్నాయి. …
Read More »వియోనా ఫిన్‌టెక్‌కి NPCI ఆమోదం.. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులకు కొత్త ఊపు
హైదరాబాద్ స్టార్టప్ వియోనా ఫిన్‌టెక్‌కి NPCI ఆమోదం లభించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు ఈజీగా చేయవచ్చు. వియోనా రూపొందించిన గ్రామ్‌పే ప్లాట్‌ఫారమ్ రైతులను నేరుగా కొనుగోలుదారులతో కలిపి పారదర్శక ధరలు, వేగవంతమైన చెల్లింపులను అందించనుంది. హైదరాబాద్‌కి చెందిన వియోనా ఫిన్‌టెక్ అనే స్టార్టప్ పెద్ద ముందడుగు వేసింది. ఈ సంస్థ గ్రామ్‌పే, వియోనా పే యాప్‌లను రూపొందించింది. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ …
Read More »యూరియా కోసం.. నడిరోడ్డుపై పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు.. ఎక్కడంటే..
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయితీ పెట్టుకోవడం.. జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం… కానీ ఇప్పుడు కొత్త సీన్ కనిపించింది. యూరియా కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్న మహిళలు ఒక్క బస్తా కోసం పొట్టు పొట్టు తన్నుకుంటున్నారు.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై మహిళ రైతులు శిఖలు పట్టుకొని తన్నుకోవడం సంచలనంగా మారింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో యూరియా కొరత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది.. పరస్పర దాడులకు కారణంగా మారుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న రైతులు గ్రోమోర్ సెంటర్ పై …
Read More »ఆర్టీవో చలాన్ కట్టాలంటూ వాట్సప్‌కు మెస్సెజ్.. క్లిక్ చేస్తే ఊహించని సీన్.. బీ అలర్ట్..
మోసం.. మోసం.. మోసం.. మనకు తెలియకుండానే మన ఫోన్ ద్వారా ఇట్టే దోచేస్తున్నారు సైబర్ బూచోళ్లు.. అందుకే.. ఫోన్ చేసినా.. మెస్సెజ్ చేసినా.. ఏ లింకులను క్లిక్ చేయొద్దు.. ఎవర్నీ నమ్మోద్దు.. అంటూ పోలీసులు అందరికీ సూచిస్తున్నారు. అయినా.. కొందరు పట్టించుకోకుండా కొందరు సైబర్ క్రిమినల్స్ మోసం బారిన పడి లబోదిబోమంటున్నారు బాధితులు.. తాజాగా.. హైదరాబాద్ నగరంలో.. మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.. ఆర్టీఓ చలాన్ కట్టలంటూ వాట్సప్ ద్వారా వచ్చిన మెస్సెజ్‌లను క్లిక్ చేసిన ఇద్దరు హైదరాబాద్ నివాసితులు దాదాపు 6 …
Read More »రేపటి జేఎన్టీయూ హైదరాబాద్ అన్ని పరీక్షలు వాయిదా..! కారణం ఇదే..
జేఎన్టీయూ హైదారబాద్ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఫార్మా డి మొదటి ఏడాది పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కె కృష్ణమోహన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 6న జరగాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించారు. ఆ రోజు గణేశ్ నిమజ్జనం ఉండటంతో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6వ తేదీన జరగాల్సిన పరీక్షను సెప్టెంబరు 17వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు …
Read More »గణేష్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్దం.. ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్స్..!
గణేశ్ ఉత్సవాల మహా శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ప్రధాన మార్గం, అనుబంధ మార్గాలు, తిరుగు ప్రయాణం, భక్తులు వెళ్లే మార్గాలు, నిమజ్జన ప్రాంతాలు, బేబీ పాండ్లు ఇతర వివరాల రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మరోవైపు ఈ ఏడాది గణనాథుడి ఊరేగింపు శోభాయాత్రలో నో సౌండ్స్ అంటూ పోలీసులు ఆంక్షలు విధించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు అంటే ప్రతి ఒక్కరి చూపు భాగ్యనగరం వైపు ఉంటుంది. చాలామంది భక్తులు నిమజ్జనాలను తిలకించడానికి ఎక్కువగా …
Read More »