అన్‌నోన్ కాల్ ఎత్తారో అడ్డంగా బుక్కైపోతారు. అవతలివారి మాటలు నమ్మారో నిండా మునిగిపోతారు. మాటలతో బెదిరిస్తారు సైబర్ బూచోళ్లు. ఎకౌంట్లో క్యాష్ పడేదాకా టార్చర్ పెడతారు. చదువుకున్నోళ్లు, ఉద్యోగులు కూడా మోసగాళ్ల బారినపడుతున్నారు. కొత్త టెక్నిక్స్‌తో జనాన్ని ట్రాప్ చేస్తున్నారు.. మోసాల్లో ముదిరిపోయిన సైబర్ క్రిమినల్స్. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త నేరంతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. తాజాగా వృద్ధులకు వచ్చే పెన్షన్లను సైతం కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్‌గా చాలామంది వృద్ధులు అనవసర లింకులను క్లిక్ చేసి తమ ఖాతాల్లోని డబ్బులు పోగొట్టుకున్నారు. పెన్షన్ …
Read More »టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరణ.. తొలిరోజే మాస్ వార్నింగ్!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇకపై పరీక్షల వాయిదాలు ఉండవని, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే తొలగించుకోండంటూ.. బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్ తన కల అన్నారు. …
Read More »బాబోయ్ మళ్లీనా.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! ఈ ప్రాంతాల్లో జోరు వానలు
దక్షిణాదిన దడ పుట్టించిన ఫెంగల్ తుపాన్ తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఫెంగల్ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. దీంతో ఇప్పట్లో వానలు మళ్లీ రావులే అని జనాలు సంబరపడ్డారు. కానీ ఇంతలో వాతావరణ శాఖ మరో సంచలన వార్త అందించింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావారణ శాఖ వెల్లడించింది. ఈ మేరక శుక్రవారం వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో …
Read More »హైదరాబాద్‌లో అతిపెద్ద సేఫ్టీ సెంటర్.. AP యువతకు నైపుణ్య శిక్షణ
తెలుగు రాష్ట్రాలతో గూగుల్ కీలక ఒప్పందాలు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు ఏపీ ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం AP యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతోంది. అలాగే.. దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇంతకీ.. ఈ గూగుల్ సేఫ్టీ సెంటర్ ఉపయోగాలేంటి?.. ఏపీలో ఎలాంటి ఆవిష్కరణలు చేయబోతోంది?…ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దాని ద్వారా ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు …
Read More »ఘనంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిల్వర్ జుబ్లీ కార్యక్రమం.. పలువురి ఉద్యోగులకు సత్కారం
ప్రముఖ పీడియాట్రిక్ మల్టీస్పెషాలిటీ, పెరినాటల్ హాస్పిటల్ ‘రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి’ తన 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 1న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఒక కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. సదరు హాస్పిటల్ చైర్మన్, ఎండీ రమేష్ కంచర్ల, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతి రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. హాస్పిటల్స్ నిర్వహణ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఇతర ప్రముఖ డాక్టర్లు, నర్సులతో సహా 4000 మందికి పైగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాత్రింబవళ్లు శ్రమించే డాక్టర్లు ఈ కార్యక్రమంలోని …
Read More »విదేశాల్లో న్యూ ఇయర్ కి వెల్కం చెప్పాలనుకుంటున్నారా.. వీసా ఫ్రీ దేశాలు ఇవే..
పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వీసా రహితంగా పర్యటించే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నూతన సంవత్సర సమయం వేళ మీరు కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే భారతీయ పౌరులు వీసా లేకుండా పర్యటించే అందమైన దేశాల గురించి తెలుసుకుందాం..డిసెంబర్ నెలలో అడుగు పెట్టాం దీంతో నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సన్నాహాలు ప్రారంభించారు. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆశ.. కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. కొంతమంది తమ కుటుంబంతో ఇంట్లోనే ఉంటూ ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకుంటారు. అయితే …
Read More »కుంకుడు రైతుకు పద్మారెడ్డికి మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం..
నల్గొండ జిల్లాకు చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి వ్యవసాయానికి చేసిన విశేష సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా’గా సత్కరించింది. పద్మా రెడ్డి హార్టికల్చర్‌లో అధునాతన శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా విశేషమైన దిగుబడులు సాధించారు.వ్యవసాయం అంటే ఇష్టముండాలే కానీ.. బీడు భూమిలో కూడా బంగారం పండిచొచ్చు అని నిరూపిస్తున్నారు కొంత మంది అన్నదాతలు. అందుకు నిదర్శనమే ఈ రైతు కూడా. కరువు ప్రాంతంలో కృషిని నమ్ముకొని ధైర్యంగా వేసిన ఓ అడుగు.. 33 ఏళ్లుగా సిరులు కురిపిస్తోంది. అది …
Read More »వీళ్లు మామూలు దొంగలు కాదు.. నిలబడినట్టే నిలబడి 6లక్షలు దోచేశారు..
దొంగతనం ఎప్పుడైనా జరగొచ్చు.. ఎవరైనా చేసేయొచ్చు. జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత.. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా.. ఇదిగో ఇలా దోచేస్తారు దొంగలు.. తాజాగా.. ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు.. బేల మండల కేంద్రంలో ఉన్న శ్రీకర్ మార్ట్‌లో పట్టపగలే భారీగా చోరీ చేశారు.. రూ.5.87లక్షలు నగదు ఉన్న సంచిని అందరి ముందే.. గుట్టుగా చోరీ చేసి పరారయ్యారు.. అయితే, చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.. డబ్బు ఉన్న సంచిని చోరీ చేసిన ఇద్దరు యువకులు.. ఎవరూ చూడని సమయంలో …
Read More »తీరనున్న సాధారణ ప్రయాణీకుల ఇక్కట్లు.. జనరల్ బోగీలను పెంచనున్న సౌత్ సెంట్రల్ రైల్వే
రైలు లో జనరల్ బోగీలో ప్రయాణం చేయాలంటే నరకం చూడాల్సిందే.. ఇంకా చెప్పాలంటే అసలు జనరల్ బోగీలోకి ఎక్కాలన్న యుద్ధం చేయాల్సిందే.. అయితే ఇక నుంచి జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణీకుల ఇబ్బందులకు చెక్ పెట్టనున్నారు. అవును ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు అంటోంది సౌత్ సెంట్రల్ రైల్వే..ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రెండే జనరల్ కోచ్ లు ఉన్న రైళ్లలో ఆ సంఖ్యను నాలుగుకు చేరుస్తున్నట్లు పేర్కొన్నారు. …
Read More »గోర్లు, చర్మంలో ఈ 5 మార్పులు గుండె జబ్బులకు సంకేతాలు.. నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం..
ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల కేసులు వేగంగా పెరగుతున్నాయి.. చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. రాబోయే సంవత్సరాల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అటువంటి పరిస్థితిలో గుండెపోటు ను నివారించడానికి, గుండె జబ్బుల దుష్ప్రభావాలను నివారించడానికి ముందుగా వాటి సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం.. దీని ద్వారా సకాలంలో చికిత్సను పొందడంతోపాటు ప్రాణాలను కాపాడుకోవచ్చు.. అయితే, గుండెలో అవాంతరాలను గుర్తించడానికి మేము మీకు కొన్ని సంకేతాలను చెప్పబోతున్నాం.. వీటిని …
Read More »