రాజధాని హైదరాబాద్ పరిధిలో మరో భారీ మోసం వెలుగుచూసింది. గోల్డ్ బిస్కట్ పేరు చెప్పి ఓ సంస్థ ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో కూకట్‌పల్లి కేంద్రంగా ఓ సంస్థ వ్యాపారం ప్రారంభించింది. తమ కంపెనీలో 8 లక్షల 8 వేలు పెట్టి రెండు గుంటల స్థలం కొంటే.. ప్రతి నెలా 4 శాతం చొప్పున రూ.32 వేలు తిరిగి చెల్లిస్తామని ప్రచారం చేశారు. ఆ రకంగా 25 నెలలు చెల్లిస్తామంటూ ఈ కంపెనీ …
Read More »Lagacharla incident: పట్నం మహేందర్ రెడ్డికి ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఈనెల 11న ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా.. హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. పట్నం వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డికి చర్లపల్లి జైలులో అందరు ఖైదీలతో ఉంచకుండా స్పెషల్ …
Read More »రేషన్ కార్డుదారులకు బ్యాడ్‌న్యూస్.. ఆ హామీ మరింత ఆలస్యం, ఇక ఉగాది నుంచే..!
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఇది నింజగా బ్యాడ్‌న్యూసే. జనవరి నుంచి రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ హాస్టల్స్, అంగన్‌నాడీ కేంద్రాలకు మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా.. జనవరి నుంచి లబ్దిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులు ఉన్న ప్రతి లబ్దిదారుడికి కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి 6 కేజీల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. …
Read More »తెలంగాణ వెదర్ రిపోర్ట్.. పెరుగుతున్న చలి తీవ్రత
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో దక్షిణం, ఉత్తరాన రెండు ఆవర్తనాలు ఉన్నాయని చెప్పారు. అయితే వాటి ప్రభావం ఏపీ, తెలంగాణలపై ప్రస్తుతానికి లేదన్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పారు. అయితే ఈనెల 26 లేదా 27 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. దాని ప్రభావంతో రాయలసీమ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలోని దక్షిణ తెలంగాణ జిల్లాల్ల్లో వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇక తెలంగాణలో చలి …
Read More »తెలంగాణలో కొత్తగా 4 విమానాశ్రయాలు.. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కూడా.. మంత్రి కీలక ప్రకటన
Telangana 4 New Airports: తెలంగాణలో ప్రస్తుతం.. హైదరాబాద్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుతో పాటు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమనాశ్రయాలు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ జిల్లాలోని మామునూరులోని విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించటమే కాకుండా.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. ఎయిర్ పోర్ట్ విస్తరణకు 256 ఎకరాలు అవసరముండగా.. అందుకోసం పరిపాలనా అనుమతులు ఇస్తూ.. 205 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. అంతేకాదు.. నవంబర్ 19వ తేదీన ఎయిర్ …
Read More »కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు..!
ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడుతున్న యువత సర్వం కోల్పోతున్న సంగతి తెలిసిందే. లక్షలకు లక్షలు బెట్టింగులు పెడుతున్న కొందరు డబ్బులు పోగొట్టుకోవటమే కాదు.. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తక్కువ సమయంలోనే ఈజీగా లక్షలకు లక్షలు సంపాదించాలనే దురశాతో ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటుపడి చిత్తవుతున్నారు. కొందరు సోషలో మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ.. అమాయకులు ఆ ఉచ్చులో చిక్కుకునేలా ప్రలోభపెడుతున్నారు. అటువంటి వీడియోనే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఓ యువకుడు తక్కువ సమయంలోనే ఈజీగా …
Read More »Posani Krishna Murali: పోసానికి భారీ షాక్.. సీఐడీ కేసు నమోదు.. ఆ ఫిర్యాదుపైనే..
సినీనటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే ఆయనపై పలు చోట్ల ఫిర్యాదులు రాగా.. తాజాగా పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కీసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారని బండారు వంశీకృష్ణ …
Read More »వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ.. రూ.50 కోట్లు కేటాయింపు, తొలగనున్న భక్తుల ఇబ్బందులు
తెలంగాణలో ప్రజల సంక్షేమంతో పాటుగా.. ఆలయాల అభివృద్ధికి రేవంత్ సర్కారు కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల యాదగిరిగుట్టలో పర్యటించిన సీఎం రేవంత్.. తిరుమల టీటీడీ తరహాలో ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం రూపు రేఖలు మారనున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దర్శనానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ఎట్టకేలకు అడుగులు …
Read More »Allam Vellulli Paste: హైదరాబాదీలు ఉలిక్కిపడే ఘటన.. టన్నులకు టన్నులే.. ప్రముఖ హోటళ్లకు ఈ దరిద్రమే సరఫరా..!?
అమ్మబాబోయ్.. ఇదేందిరా ఇది.. ఇంత ఘోరంగా ఉన్నారేంట్రా. ఇది కచ్చితంగా హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడాల్సిన ఘటన. జంట నగరాల్లో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలోకి వెళ్లి.. లొట్టలేసుకుంటూ తినే ప్రతిఒక్కరూ ఒక్కక్షణం గుండెను రాయి చేసుకోవాల్సిందే. ఇటీవల పదే పదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ గురించిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి.. కల్తీలు జరుగుతున్నాయని.. ఆ కల్తీ సరుకు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తోందని హెచ్చరిస్తే.. మనమేమి అలాంటి కల్తీ సరుకు వాడే హోటళ్లలోకి వెళ్లట్లేదు.. అలాంటి దరిద్రాన్ని వాడే రెస్టారెంట్లలోని …
Read More »పుప్పాల్‌గూడలో భారీ అగ్ని ప్రమాదం.. ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
హైదరాబాద్ పుప్పాల్‌గూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోల్డెన్ ఓరియో అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటంతో మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించగానే ఇంట్లోని ఐదుగురు కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. అపార్ట్‌మెంట్ వాసులు సైతం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్ ప్లాట్ పూర్తిగా దగ్ధం అయింది. ఇంట్లో దాచుకున్న డబ్బులు, బట్టలు, విలువైన సామాగ్రి కాలి బూడిదైంది. దాదాపు 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు …
Read More »