రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే విద్యా సంవత్సరానికి కూడా సర్కార్ ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు విభాగాలు, శాఖల్లో ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి.. ఆ ప్రకారంగానే టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. …
Read More »తొలిరోజు గ్రూప్ 2 పరీక్షకు భారీగా డుమ్మా.. 46.30 శాతం మంది మాత్రమే హాజరు!
ఎన్నో సంవత్సరాల తర్వాత భారీగా కొలువుల భర్తీకి నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష తొలిరోజు కనీసం సగం మంది కూడా పరీక్షకు హాజరుకాకవపోవడం చర్చణీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకంగా భావించే గ్రూప్ 2 పోస్టులకు తీవ్ర పోటీ ఉంటుంది. దరఖాస్తులు ఐదున్నర లక్షలు వచ్చినా.. వీరిలో సగం మంది కూడా పరీక్ష రాయకపోవడం విశేషం.. తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగే రాతపరీక్షలు డిసెంబరు 15న ప్రారంభమవగా.. డిసెంబర్ 16వ తేదీతో …
Read More »దసలి పట్టు అంటే ఏంటి? దానికి ఎందుకంత క్రేజ్ ?
శతాబ్దాల చరిత్ర కలిగిన పట్టు.. దేవాది దేవతలకు మాత్రమే పరిమితమైన పట్టు.. ఆనాడు నిజాంను మంత్రముగ్దున్ని చేసి నేడు మగువల మనసులనూ కనికట్టు చేస్తోంది. ప్రాణహిత గోదావరి తీరం వెంట పుట్టిన ఈ పట్టు.. నేడు ఫ్యాషన్ ప్రపంచాన్నీ ఓ పట్టు పడుతోంది.ఆదివాసీ ఖిల్లాలో అరుదైన పరిశ్రమగా.. శ్రమే ఆయుదంగా సాగిస్తున్న ఈ పంట గిరిజన రైతుల పాలిట కల్పతరువుగా మారుతోంది. ఇంకాస్త ప్రభుత్వాల ప్రోత్సాహం అదనమైతే ఈ పట్టు తెలంగాణ వస్త్రరాజంగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం. ఇంతకీ ఏంటా పట్టు కథ అంటారా.. …
Read More »సోషల్ మీడియా పోస్ట్‌లపై పోలీసుల సీరియస్.. అడ్డగోలు పోస్టులకు కేసులు తప్పవని వార్నింగ్..!
సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తే.. తాట తీస్తోంది తెలంగాణ పోలీస్. ఇదే క్రమంలో లేటెస్టుగా రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై యాక్షన్ మొదలు పెట్టారు హైదరాబాద్ పోలీసులు.ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రతి చిన్న విషయం దగ్గరి నుంచి వార్తల వరకు సోషల్ మీడియానే జనం ఫాలో అవుతున్నారు. ఇదే అదునుగా కొందరు ఆకతాయిలు ఇష్టానుసారం రీల్స్ చేస్తూ జనాలను ఇబ్బంది పెడుతున్నారు. రోడ్లపై పిచ్చిగా వ్యవహరించడం. డబ్బులు వెదజల్లడం, వెకిలి చేష్టలతో అందరినీ బెంబేలెత్తిస్తున్నారు. అయితే …
Read More »తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు.. వైద్యుల హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలపై చలిపులి..పంజా విసురుతోంది. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఆదిలాబాద్‌లో కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా..అల్లూరి జిల్లా మినుములూరులో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది. నిర్మల్‌లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ …
Read More »పెళ్లికి రావాలని సీఎం చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిసి తన వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు. పీవీ సింధు, వ్యాపారవేత్త వెంకటదత్త సాయిల వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో సింధు పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందచేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడిని …
Read More »విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. ఓ పెట్టుబడిః రేవంత్ రెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లతోపాటు సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రంగారెడ్డి జిల్లా చిలుకూరులో స్కూళ్లు, హాస్టల్స్‌లో కామన్ డైట్ ప్రారంభించిన తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్స్‌లో చదివితేనే విద్యార్థులు రాణిస్తారనే అపోహ ఉండేదని, సంక్షేమ హాస్టల్స్‌లోని విద్యార్థుల్లో విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తొలిసారి సర్వేల్‌లో సంక్షేమ పాఠశాలను ప్రారంభించారని …
Read More »రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు.. షూ ధరించిన వారికి నో ఎంట్రీ!
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే టీజీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1368 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు జరుగుతాయి. డిసెంబర్ 15, 16 తేదీల్లో 2 రోజుల పాటు మొత్తం 4 పేపర్లకు పరీక్ష జరగనుంది. 5,51,847 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు..తెలంగాణలో ఆదివారం, సోమవారం గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ …
Read More »మొదటిసారి అగ్రరాజ్యానికి గులాబీ బాస్.. కారణం ఏంటో తెలుసా..?
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా అమెరికా పయణం కానున్నారు. ఆయన అగ్రరాజ్యానికి వెళ్లడం ఇదే మొదటిసారి. మరి మాజీ ముఖ్యమంత్రి ఎందుకని అమెరికా వెళ్తున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి, మంచి సాహిత్య అభిమాని ఇలా చాలా రకాలుగా ఆయన గురించి ప్రజలకు తెలుసు. కానీ ఇది మాత్రం చాలామందికి తెలవని ఆసక్తికరమైన ఓ విషయం. మామూలుగా రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు తరచుగా చేస్తూ ఉంటారు. అందులోనూ అధికారంలో ఉంటే ఎక్కే విమానం.. దిగే విమానం …
Read More »అజ్ఞాతంలో మోహన్ బాబు.. పారిపోలేదంటూ ట్వీట్..
టీవీ9 రిపోర్టర్ రంజిత్‌పై దాడికి నిరసనగా తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. నాలుగు రోజులుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు వాంగ్మూలం రికార్డు చేయడానికి ప్రయత్నించారు పోలీసులు.మొన్నటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ వివాదం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని కవరేజీ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశాడు. టీవీ9 మీడియా రిపోర్టర్ రంజిత్ పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. …
Read More »