సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న వర్చువల్‌గా ట్రైన్ ప్రారంభించగా.. ఈనెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే కొత్త వందేభారత్ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ ఆశించినంతగా ఉండటం లేదు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దాదాపుగా అన్ని కోచ్‌లు ఖాళీగానే ఉంటున్నాయి. 80శాతానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయని.. రైల్వే అధికారులు గుర్తించారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ, తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ ట్రైన్ ఏర్పాటు చేశారు. …
Read More »తిరుపతి లడ్డూ పై కార్తీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. హీరో రియాక్షన్ ఇదే..
తాజాగా నిన్న హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో కార్తీతోపాటు అరవింద్ స్వామి, మూవీ టీమ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాపిక్ చాలా సెన్సిటివ్. మనకు వద్దు” అంటూ సమాధానం చెప్పాడు. కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ సత్యం సుందరం. ఇందులో …
Read More »అరుదైన జబ్బులతో బాధపడే పిల్లలకు వరం.. రూ.50 లక్షల ఖరీదైన వైద్యం నిమ్స్‌లో ఉచితం
అరుదైన జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వరం లాంటి వార్త. అలాంటి చిన్నారులకు హైదరాబాద్ నిమ్స్‌లో 50 లక్షల ఖరీదైన ఉచిత వైద్యం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ (NPRD) పాలసీని ఇప్పుడు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అమలు చేస్తున్నారు. జెనెటిక్, అరుదైన వ్యాధులతో బాధపడే చిన్నారులకు ట్రీట్‌మెంట్ అందించేందుకు నిమ్స్ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులు, డాక్టర్లను ఏర్పాటు చేశారు. చిన్నారులు గౌచర్, పాంపే వంటి అరుదైన, జెనెటిక్ జబ్బుల బారిన పడితే కోలుకోవటం కష్టం. వారికి జీవితాంతం ఖరీదైన …
Read More »దామగుండం ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్.. 12 లక్షల ఔషధ మొక్కలు నరికేస్తారా..?
వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌కు ఏళ్ల చరిత్ర ఉంది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉన్న దామగుండం అడవిలో కొన్ని వేల రకాల మొక్కలు ఉన్నాయి. ఆ రిజర్వ్ ఫారెస్ట్‌కు ఎవరైనా వచ్చి ఆ గాలిని పీలిస్తే ఉన్న రోగాలు పూర్తిగా నయమవుతాయని స్థానికులు అంటుంటారు. దామగుండం వెళ్తే యమగండం పోతుందని ఓ నానుడి కూడా ఉంది. అంతటి చరిత్ర గల దామగుండం ఫారెస్ట్‌పై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. దామగుండం ఫారెస్ట్‌లో తూర్పు నౌకాదళ రాడార్ స్టేషన్ నెలకొల్పేందుకు …
Read More »హైదరాబాద్‌లో మళ్లీ ‘హైడ్రా’ కూల్చివేతలు.. కూకట్‌పల్లిలోని ఆక్రమణలపై బుల్డోజర్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా.. నగరంలో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. చెరువుల, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా.. కూల్చివేతలు ప్రారంభించింది. కూకట్పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను తెల్లవారుజాము నుంచే కూల్చేస్తోంది. నల్లచెరువు మెుత్తం విస్తీర్ణం మెుత్తం 27 ఎకరాలు కాగా.. 14 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే బుల్డోజర్లతో …
Read More »తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. BJP ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ అంశం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్ చేయటం సంచలనంగా మారింది. ఈ అంశం దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. శ్రీవారి ప్రసాదాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలుపుతున్నారనే విషయం బయటకు రావటం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కేంద్రమంత్రి నడ్డా ఏపీ సీఎం చంద్రబాబును వివరణ కూడా కోరారు. పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. తాజాగా.. ఈ వివాదంపై …
Read More »ఏకంగా 13 రోజులు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. Dussehra Holidays తేదీలివే!
అక్టోబర్ నెలలో తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా 13 రోజులు దసరా (Dasara Holidays) సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో.. అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో ఈసారి ఏకంగా 13 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి (Gandhi Jayanti 2024) నాడు సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు …
Read More »పేదలకు రేవంత్ సర్కారు తీపి కబురు… పది రోజుల్లోనే విధివిధానాలు ఖరారు
ఇల్లు లేని పేదలకు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను సర్కారు వారం, పది రోజుల్లో ఖరారు చేయనున్నారని, ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. . అంతేకాదు, దీనిని కేంద్రం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై అర్బన్, రూరల్) పథకానికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి నిర్వహించిన ప్రజాపాలన …
Read More »తిరుపతి లడ్డూ వివాదంపై బండి సంజయ్ ఘాటు స్పందన.. చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్
దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డూకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే.. ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూపై నిన్న(సెప్టెంబర్ 18న) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఆందోళన రేకెత్తించటంతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతి లడ్డూ ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపి.. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందంటూ చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేయటం ఇప్పుడు …
Read More »బాబు చిట్టీ.. అక్కడ మార్కులు పడ్డాయిగా.. ఇక ఇక్కడ దృష్టి పెట్టు.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రైతు రుణమాఫీ, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ఇటీవల రాజీవ్ గాంధీ విగ్రహం ఇలా పలు అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శల పర్వం నడుస్తోంది. కాగా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఒకే నెలలో ఏకంగా 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు ప్రాణాలు వదిలినట్టు ఉన్న రిపోర్టులపై వాడీ వేడిగా చర్చ నడుస్తోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్.. తప్పుడు లెక్కలు చెప్తోందని.. అసలు మరణాల సంఖ్యను దాచిపెడుతోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. …
Read More »