తెలంగాణ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రణాళిక ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో.. శుక్రవారం (ఆగస్టు 2) అసెంబ్లీ (TG Assembly)లో జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. యువతకు హామీ ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ (Job Calendar) విడుదల చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్త చేస్తామని రెండు రోజుల క్రితలం మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించిన …
Read More »తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్
తెలంగాణను వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు. గత 10 రోజులకు పైగా.. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయితే నేడు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. …
Read More »పొలిటికల్ ఎంట్రీపై అలేఖ్య తారకరత్న..
అలేఖ్య తారకరత్న తాజాగా తన ఫాలోవర్లతో ఇన్ స్టాలో చిట్ చాట్ చేసింది. తన బర్త్ డే సందర్భంగా అలేఖ్య అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. బాలయ్య బాబు విష్ చేశాడా? అని ఓ నెటిజన్ అడిగితే.. విష్ చేయలేదు.. ఆయన బిజీగా ఉండి ఉంటారు అని సమాధానం ఇచ్చేసింది. ఇక విజయ సాయి రెడ్డి మీద వస్తోన్న రూమర్ల మీద, నందమూరి కుటుంబం దూరం పెట్టడం.. నారా లోకేష్ ఆర్థిక సాయం ఇలా అనేక అంశాల మీద అలేఖ్య సమాధానం చెప్పింది. …
Read More »విద్యుత్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా.. ఏపీ మాజీ ప్రధాన న్యాయమూర్తి..
తెలంగాణలో ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఛైర్మన్‌గా గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమిస్తూ.. మంగళవారం (జులై 30న) ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ మదన్ బీ లోకూర్.. 2011లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. మొదట నియమించిన జస్టిస్ నర్సింహా రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ …
Read More »జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ విజయమ్మల భేటీలో మరో ట్విస్ట్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి లోటస్‌పాండ్‌లోని వైఎస్ విజయమ్మ ఇంటికి వెళ్లి కలిసినట్లు ప్రచారం జరిగింది. విజయమ్మ యోగ క్షేమాల గురించి అడిగి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై జేసీ ఆరా తీసినట్లు వార్తలొచ్చాయి. అయితే జేసీ విజయమ్మ ఇంటికి వెళ్లడం ఇక్కడ హాట్ టాపిక్ అయ్యింది. జేసీ పనిగట్టుకుని మరీ వెళ్లి …
Read More »హైదరాబాద్‌లో పంజా విసురుతున్న డెంగీ..
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అయితే డెంగీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, నిలోఫర్‌లోని చిన్న పిల్లల విభాగానికి డెంగీ జ్వరంతో వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారం రోజుల క్రితం మూసాపేటలో ఓ 10 ఏళ్ల ఓ చిన్నారి డెంగీతో ప్రాణాలు కోల్పోయింది. సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. అలా నిర్లక్ష్యం …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. KCR రికార్డ్ బ్రేక్ చేసిన సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సోమవారం (జులై 29) ఐదో రోజు అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో దద్దరిల్లింది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా.. అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్ పద్దుపై చర్చించారు. 19 శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3:15 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. సాయంత్రం 4.40 నుంచి 5. 50 వరకు టీ …
Read More »తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో రెండ్రోజుల పాటు వానలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు
తెలంగాణలో గత వారం పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే ఇప్పట్లో వర్షాలు రాష్ట్రాన్ని వీడేలా కనిపించటం లేదు. తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. రాజన్న సిరిసిల్ల, వరంగల్, …
Read More »పలు రాష్ట్రాలకు గవర్నర్లు నియమాకం.. తెలంగాణకు ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం
పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఆమోదం తెలిపారు. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లతో పాటు మరో ముగ్గుర్ని వేరే రాష్ట్రాల నుంచి బదిలీ చేశారు. తెలంగాణకు సీనియర్ బీజేపీ నేత, త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మ నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు. మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభౌ కిసన్‌రావ్ బాగ్డేను రాజస్థాన్ గవర్నర్‌గా, కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్‌ను ఝార్ఖండ్‌కు.కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ సి.హెచ్.విజయశంకర్‌ను మేఘాలయ గవర్నర్‌గా నియమించారు. రాజస్థాన్ …
Read More »హైదరాబాద్‌ను వణికిస్తోన్న నొరో వైరస్.. వేగంగా పెరుగుతున్న కేసులు..
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే ప్రజలను మరో కొత్త వైరస్ భయపెడుతోంది. అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్.. ఇప్పుడు హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా.. కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వెల్లడించింది. ఈ నొరో వైరస్ విషయంలో ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. నొరో వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది. …
Read More »