తాను పార్టీ మారినా, భావజాలం మాత్రం మారలేదని బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఖాకీ, ఖద్దర్ రెండూ తనకు సమానమని, ఏ వేదికలో ఉన్నా సరైన దిశలోనే ముందుకు సాగుతానని తెలిపారు. బహుజన వర్గాల హక్కుల కోసం పోరాటం తన జీవిత లక్ష్యమని, చివరి శ్వాస వరకు అదే దిశగా కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశగా అడుగులు వేస్తున్న మాజీ IPS అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్.. తన ప్రయాణం, తన ఆలోచనలను టీవీ9 తెలుగు మేనేజింగ్ …
Read More »వైఎస్ఆర్ వారసుడు రాజారెడ్డే అని తేల్చేసిన షర్మిల
తన కొడుకే వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడు అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తను ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టకుండానే.. వైసీపీ ఇంతలా స్పందిస్తుంటే ఇది భయమా? బెదురా అనేది వాళ్లకే తెలియాలన్నారు. రాజారెడ్డి అని తన బిడ్డకు పేరు పెట్టింది వైఎస్సార్ అని షర్మిల చెప్పారు. ఇటీవల ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో షర్మిల వెంట ఆయన తనయుడు కనిపిస్తూ ఉండటంతో.. అతని పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. తన కుమారుడు సమయం వచ్చినప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తాడని.. షర్మిల బహిరంగంగానే …
Read More »అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? వైసీపీ చీఫ్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ఎరువురులు సరఫరా చేసి ఉండే రైతులు రోడ్డెక్కేవారా? అని మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస బాధ్యతను కూడా నిర్వర్తించడంలేదని మండిపడ్డారు. కుప్పం లోనూ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో ఎప్పుడూ రైతులు రోడ్డెక్కలేదని.. అప్పుడు లేని రైతు కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయన్నారు.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? అని జగన్ ప్రశ్నించారు లా అండ్ ఆర్డర్ కాపాడటం లేదు. ప్రజల అభివృద్ధి లేదు సంక్షేమం లేదు.. ప్రజలకు …
Read More »వారు పార్టీ మారారు.. సాక్ష్యం చూపిస్తున్న కేటీఆర్.. నెక్స్ట్ ఏం జరగనుంది..?
అధికారం చేతులు మారగానే.. గోడదూకేశారు. హమ్మయ్య అధికార పార్టీలోకి వచ్చేశాం.. ఇక సేఫ్ అనుకున్నారు. కానీ, ఫిరాయింపులమీద సుప్రీం ఆదేశాలు.. ఆ వెంటనే స్పీకర్ నోటీసులతో.. ఇప్పుడు సీన్ మొత్తం రివర్సయిపోయింది. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు, ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ వ్యవహారంలో ఎవరి వ్యూహాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు అనర్హతపై “తాడోపేడో” అంటుండగా, మరికొందరు సైలెంట్‌గా ఏం జరుగుతుందో చూసే యోచనలో …
Read More »రెడ్‌బుక్‌లో చాలా ఉన్నాయి.. ఇక తెలంగాణపై దృష్టిపెడతాం.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
పార్టీ ఆఫీసంటే అది కార్యకర్తల కార్యాలయమే అన్నారు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎంని కలవాలంటే అప్పాయింట్‌మెంట్ అవసరంకానీ.. పార్టీ ఆఫీసుకు ఎవరు ఎప్పుడొచ్చినా ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. ఢిల్లీ బీజేపీ ఆఫీసు కన్నా టీడీపీ ఆఫీస్ పెద్దగా ఉందన్నారు లోకేష్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ NDA అభ్యర్థికి ఎందుకు ఓటేసిందో వైఎస్ జగన్‌నే అడగాలన్నారు లోకేష్. 2029 ఎన్నికల్లో కూడా మోదీకే తమ మద్దతు ఉంటుందన్నారు. కేటీఆర్‌ని కూడా కలుస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్. పక్క రాష్ట్ర …
Read More »తిరిగి పార్టీలోకి వచ్చేయండి.. తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. ఆ నేతలే టార్గెట్‌గా..
తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కి శ్రీకారం చుట్టిందా.. గతంలో పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి వెల్‌కమ్ పలుకుతారా?.. పార్టీ వీడిన వారిలో సీనియర్లు ఎవరున్నారు. పాత వాళ్లని మళ్లీ వెనక్కి పిలవడం వల్ల కాంగ్రెస్‌కు ఏం లాభం.. అసలు సడెన్‌గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనేది ఈ కథనంలో తెలుసుకోండి.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని వీడి బీఆర్‌ఎస్, బీజేపీలో చేరిన నేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడం, ఇతర నేతలతో విభేదాల కారణంగా …
Read More »సీఎం ఇల్లు అయితేనేం.. కూల్చేయాల్సిందే..! అందరికీ ఆదర్శంగా రేవంత్ రెడ్డి..
అభివృద్ధి విషయంలో తరతమ భేదాలు చూడకూడదని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ మాటను ఆచరించి చూపి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలంలోని సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో చేపట్టిన 4 లేన్ల రోడ్డు నిర్మాణ పనుల వేళ.. తన ఇంటి ఇంటి ప్రహరీ అడ్డు రావడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే కూల్చేయాలని ఆదేశాలిచ్చి ఆదర్శంగా నిలిచారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామంలోని మొత్తం 43 ఇళ్లను పాక్షికంగా కూల్చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సీఎం ఆదేశాలతో.. కొండారెడ్డిపల్లిలో …
Read More »ఉప రాష్ట్రపతి ఓటింగ్‌కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు.. ఎందుకంటే?
ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం 5 వరకు కొత్త పార్లమెంట్ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరనుంది. ఆ తర్వాత ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. అయితే ఉభయ సభల్లో.. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం 5 వరకు కొత్త పార్లమెంట్ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరనుంది. ఆ …
Read More »రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికలు..ఆసక్తికరంగా మారిన ఎన్నికలు.. ఎవరి బలం ఎంతో తెలుసా..
భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఓటింగ్ మంగళవారం (సెప్టెంబర్ 9న) జరుగుతుంది. NDAకి చెందిన CP రాధాకృష్ణన్, భారత కూటమికి చెందిన సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ ఉంది. ఇద్దరు అభ్యర్థులు అనుభవం, విభిన్న నేపథ్యాలను కలిగి ఉన్నాయి. లోక్‌సభలో NDAకి మెజారిటీ ఉన్నందున రాధాకృష్ణన్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని.. అయితే ప్రతిపక్షాలు కూడా సుదర్శన్ రెడ్డికి ఐక్యంగా మద్దతు ఇస్తున్న నేపధ్యంలో ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం అయింది. సెప్టెంబర్ …
Read More »ఏం జరగనుంది..? సడెన్‌గా ఆ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
ఒక్కరు.. ఒకే ఒక్కరు తప్పా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కడియం శ్రీహరి మినహా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి కూడా హాజరయ్యారన్న సమాచారంతో అసలేం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై …
Read More »