ఎలక్షన్ ఏదైనా ఎలక్షనే అంటున్నాయి..ఏపీలో అధికార, విపక్ష పార్టీలు.. అది జడ్పీ చైర్మన్ ఎన్నికైనా.. ఉపసర్పంచ్ ఎన్నికైనా తగ్గేదేలేదంటూ పోటాపోటీగా క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి.. దీంతో నేడు కడపసహా పలు జిల్లాల్లో జరగనున్న లోకల్ బాడీ బై ఎలక్షన్స్..హీట్ పుటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ 9 చోట్ల లోకల్‌బాడీ ఉప ఎన్నికలు జరగనున్నాయి..ఎలక్షన్ ఏదైనా ఎలక్షనే అంటున్నాయి..ఏపీలో అధికార, విపక్ష పార్టీలు.. అది జడ్పీ చైర్మన్ ఎన్నికైనా.. ఉపసర్పంచ్ ఎన్నికైనా తగ్గేదేలేదంటూ పోటాపోటీగా క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి.. దీంతో నేడు కడపసహా పలు జిల్లాల్లో జరగనున్న …
Read More »30శాతం కమీషన్లు..! ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. అసెంబ్లీలో దుమ్ముదుమారం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.. పలు అంశాలపై సుధీర్ఘ చర్చ కొనసాగుతోంది.. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పెద్దలు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ.. స్వయంగా కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ అసెంబ్లీ వేదికగా కేటీఆర్ కామెంట్ చేశారు. అయితే.. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30శాతం కమీషన్లు తీసుకుంటున్నట్టు నిరూపించాలంటూ కేటీఆర్‌కు …
Read More »నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రెవెన్యూలో 10,954 గ్రామస్థాయి పోస్టులు వస్తున్నాయ్!
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం (మార్చి 19) శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్ర భట్టి ఇచ్చన బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్ర నిరుద్యోగులకు..తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం (మార్చి 19) ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టిన రెండో బడ్జెట్ ఇది. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి …
Read More »మళ్లీ మళ్లీ చెప్పను..! అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ స్వీట్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొబైల్ ఫోన్ల వినియోగంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కొంతమంది సభ్యులు సభలో కూర్చోనే ఫోన్లలో మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించే అసెంబ్లీలో మొబైల్ ఫోన్లను ఉపయోగించుకుంటూ వ్యక్తిగత సంభాషణల్లో నిమగ్నమవుతుండటం తగదంటూ సభ్యులను సున్నితంగా హెచ్చురించారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక అని, ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. సభా …
Read More »హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను! మరోసారి భాషా వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తుండగా, పవన్ కళ్యాణ్ హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తారని ప్రశ్నించారు. డీఎంకే నేతలు కూడా స్పందిస్తూ హిందీని బలవంతం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఈ అంశంపై ట్వీట్ చేశారు.హిందీ భాషా గురించి కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. తమపై హిందీని బలవంతంగా కేంద్రం రుద్దుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాంటిదేం లేదని కేంద్ర …
Read More »మీకు – నాకు మధ్య పరదాలు లేవు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తమది ప్రజా ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరుగుతున్న “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా తణుకులోని ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చంద్రబాు నాయుడు చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజలు ఏమి చెప్పినా వినే ప్రభుత్వం తమదన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి, మీకు నాకు మధ్య పరదాలు లేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ …
Read More »తెలంగాణలో డీలిమిటేషన్ సెగలు.. కాంగ్రెస్ వ్యూహంపై బీఆర్ఎస్, బీజేపీ రియాక్షన్ ఇదే..p
డీలిమిటేషన్ అంశం.. తమిళనాడులోనే కాదు.. తెలంగాణలోనూ సెగలు పుట్టిస్తుంది. అఖిలపక్షంలో చర్చిద్దామని.. కాంగ్రెస్ అంటుంది. తమిళ రాజకీయ ట్రాప్‌లో పడ్డారని.. కమలం పార్టీ కస్సుబుస్సులాడుతున్న వేళ.. అసలు అఖిలపక్షం జరిగేదెప్పుడు.. వెళ్లేది ఎవరు?. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి..? డీలిమిటేషన్‌పై దక్షిణాది జంగ్ సైరన్ మోగిస్తున్న వేళ.. తెలంగాణకు కూడా ఈ సెగలు తాకాయి. డీలిమిటేషన్ పై అఖిలపక్షం నిర్వహిస్తామని అధికార కాంగ్రెస్ అంటుంది. 22న స్టాలిన్ భేటీ కంటే ముందే తెలంగాణలో అఖిలపక్ష భేటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్. కానీ.. మీటింగ్ ఎప్పుడు ఉంటుందో …
Read More »జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఆయన పేరును జనసేన అధినేత పవన్ ఫైనల్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన సోదరుడు నాగబాబు పేరును జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు దక్కే పదవిపై కొంతకాలంగా అనేక …
Read More »ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక రూలింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారని స్పీకర్ తెలిపారు. ఇందులో సభాపతిని, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారని పేర్కొన్నారు. లోక్‌సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది అవాస్తమన్నారు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక రూలింగ్ ఇచ్చారు. బెదిరింపులు, అభియోగాలతో జగన్ తనకు లేఖ రాశారన్నారు. ప్రతిపక్ష …
Read More »తుది దశకు చేరుకున్న ఏపీ బడ్జెట్ కసరత్తు.. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు.!
ఓ వైపు సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలు.. మరోవైపు అభివృద్ధి ప్రణాళికలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ దిశగా బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఆర్థిక మంత్రి కేశవ్‌తో కలిసి దీనికి తుది రూపు దిద్దుతున్నారు.ఏపీ బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ బడ్జెట్‌కు ముఖ్య లక్ష్యం రాష్ట్ర GSDP వృద్ధి రేటు 15 శాతం సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడమే. ఇందుకోసం మూలధన వ్యయాన్ని పెంచుతూ, …
Read More »