గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేత పొగడ్తల వర్సం కురిపించారు. గవర్నర్ పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు వైసీపీ నెల్లిమర్ల ఇన్‌చార్జ్ బడ్డుకొండ అప్పలనాయుడు. గజపతిరాజు ఈ ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిన మహానుభావులు అంటూ కొనియాడారు. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టే ఉన్నతమైన పదవులు దక్కాయని చెప్పారు వైసీపీ నేత అప్పలనాయుడు. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ కావడం సంతోషంగా ఉందన్నారు. అశోక్ గజపతిరాజు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నారని అన్నారు. పదవి ఇచ్చిన బీజేపీకి ధన్యవాదాలు …
Read More »వైసీపీ సింబల్ మార్పు ప్రచారం ఫేక్.. ఈసీకి ఎలాంటి లేఖ రాయలేదన్న అధిష్టానం!
వైసీపీ పార్టీ సింబల్ మార్పుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమన వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది. వైసీపీ పార్టీ చిహ్నాన్ని మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ పార్టీ గుర్తును మార్చాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశాసినట్టు ఉదయం నుంచి సోషల్ మీడియాలో …
Read More »సీనియర్లు ఉన్నా అశోక్ గజపతి రాజు వైపే మొగ్గు.. గవర్నర్ పదవి దక్కడానికి కారణం అదేనా..
ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ.. గవర్నర్ పదవికి అశోక్ గజపతిరాజు వైపే మొగ్గు చూపింది అధిష్టానం.. సీనియర్లు ఎంతమంది ఉన్నా అశోక్ గజపతి రాజుకి గవర్నర్ పదవి దక్కడం పై పాలిటిక్స్ లో సర్వత్రా చర్చ నడుస్తోంది. అశోక్ గజపతి రాజు వైపు ఎన్డీఏ ప్రభుత్వం మొగ్గు చూపడానికి కారణాలేంటి? అసలు అశోక్ గజపతిరాజు ఎవరు?.. అంటే అశోక్ గజపతి రాజు భారతదేశ సంస్థానాల్లోనే అత్యంత గౌరవం పొందిన గజపతిరాజుల సంస్థాన వారసులు. అశోక్ గజపతి తండ్రి …
Read More »ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..! ఇద్దరు సీఎంలతో కేంద్రం భేటీ..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కేంద్రానికి చేరింది. గోదావరి, కృష్ణా నదుల జలాల పంపకం, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జల వివాదానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల జల జగడం ఢిల్లీకి చేరింది. ఏపీ, తెలంగాణ సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈసారైనా గోదావరి, కృష్ణా జలాల లెక్కలు తేలేనా? బనకచర్ల భవిష్యత్ ఎలా ఉండబోతుంది? బేసిన్లు, భేషజాలకు …
Read More »అప్పులపాలయ్యా.. నా కారు ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
నియోజవర్గంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గొప్పగా బతికిన మా కుటుంబం ఇప్పుడు పేదరికంలో ఉందన్నారు. రాజకీయాల కారణంగా అప్పులపాలైపోయానని అన్నారు. తన కారును కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లిపోయారని.. ప్రస్తుతం తన అల్లుడి కారును వాడుతున్నానన్నారు. ‘‘గతంలో అష్టఐశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం.. ఈ రోజు చాలా పేదరికంలో ఉంది.. అప్పులపాలయ్యాం.. నా కారు కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. ప్రస్తుతం నా అల్లుడి కారు వాడుతున్నా’’.. అంటూ తూర్పు గోదావరి జిల్లా …
Read More »తెలంగాణలో రోహిత్ వేముల చట్టం..! బీజేపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: డిప్యూటీ సీఎం భట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన వ్యక్తిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. రోహిత్ వేములకు న్యాయం చేయడానికి త్వరలోనే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులైన వారికి పదవులివ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క. …
Read More »TDP vs YSRCP: అసలీ ప్రైవేట్ కేసులు అంటే ఏంటి…? వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది…?
మాజీ సీఎం జగన్ వరుస పర్యటనలపై రాజకీయ రచ్చ ఏరేంజ్‌లో అయితే నడుస్తోందో… కేసులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి…! అంతకుముందు గుంటూరు, మొన్నామధ్య పల్నాడు, లేటెస్ట్‌గా బంగారుపాళ్యం పర్యటనపైనా కేసులు ఫైల్ అవ్వడం చర్చనీయాంశమైంది. జగన్ పర్యటనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం… ప్రభుత్వ అండదండలతో రెచ్చిపోతారా…! విచ్చలవిడిగా కేసులు పెడతారా…! మీరు మాపై కేసు మీద కేసు రాస్తే… మేం తప్పక ఇస్తాం రివర్స్ డోసు అంటున్నారు వైసీపీ నేతలు. చట్టబద్ధంకాని కేసులను చట్టబద్ధంగానే తేల్చుకుంటామంటూ సవాల్ చేస్తున్నారు. ప్రైవేట్ కేసులు …
Read More »కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారికి బిగ్ అలర్ట్.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన..
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది.. ఈ క్రమంలోనే.. రేవంత్ సర్కార్.. కొత్తగా మంజూరైన వారికి రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నెల 14న తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ …
Read More »11 ఏండ్ల క్రితం ఇదే రోజు బీజేపీలో చేరా.. రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ సంచలన ప్రకటన..
రాజాసింగ్ రాజీనామాను అధిష్ఠానం ఆమోదించడంతో రాజాసింగ్ దారెటు అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే.. బీజేపీ అధిష్ఠానం తన రాజీనామా ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. 11 ఏళ్ల కిందట ఇదే రోజు బీజేపీలో చేరానని.. తనను నమ్మి మూడు సార్లు బీజేపీ టికెట్ ఇచ్చిందని రాజాసింగ్ చెప్పారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను బీజేపీ (భారతీయ జనతా పార్టీ) అధిష్ఠానం ఆమోదించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయంలో అలిగిన రాజాసింగ్ జూన్ 30న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ …
Read More »రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం..
రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించింది. BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్టీకి రాజీనామా ఇచ్చారు. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా లేఖను పంపగా.. రాజాసింగ్ రాజీనామాను జేపీ నడ్డా ఆమోదించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఇటీవల జరిగిన BJP రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. …
Read More »