పాలిటిక్స్

కాంగ్రెస్ ఎంపీ సీటు కింద రూ.500 నోట్ల కట్ట.. విచారణకు ఆదేశించిన రాజ్యసభ ఛైర్మన్

రాజ్యసభలో బయటపడ్డ 500 రూపాయల నోట్ల కట్ట. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధంఖర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ సభ్యుల బెంచ్‌పై కరెన్సీ నోట్ల గుట్టు రట్టు కావడంపై రాజ్యసభలో దుమారం మొదలైంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ ఈ సమాచారం ఇవ్వడంతో రాజకీయ రచ్చకు దారి తీసింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీకి సంబంధించిన సీటు నంబర్ 222 కింద రూ.500 నోట్ల కట్ట కనిపించింది. అదే సమయంలో …

Read More »

ఇక బ్యాంకు ఖాతాకు 4 నామినీలు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

Nominee: కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఏర్పడిన సమస్యల తర్వాత బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లులో ఈ ప్రధాన మార్పులు చేశారు. ఇప్పుడు ఒక నామినీకి బదులుగా 4 నామినీలు యాడ్‌ చేసేందుకు అనుమతి ఉంటుంది.. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు డిసెంబర్ 3న లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ఒక బ్యాంకు ఖాతాలో 4 నామినీలను జోడించడానికి అందిస్తుంది. కొత్త బ్యాంకింగ్ చట్టం బిల్లులో డిపాజిటర్లకు మెరుగైన రక్షణ, ప్రైవేట్ బ్యాంకుల్లో మెరుగైన సేవలందించే అంశాలు కూడా ఉన్నాయి. క్లెయిమ్ చేయని షేర్లు, …

Read More »

ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..

గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయకపోవడం.. మంజూరు చేసిన కార్డులకు కోతలు విధించడం.. నిబంధనలు సడలించకుండా కఠినంగా వ్యవహరించటంతో.. గత నాలుగేళ్లుగా అందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయింది. ప్రతి ఆరు నెలలకు కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కూడా.. ఏదో ఒక సాకు చెప్పి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అర్హులైన ప్రతి …

Read More »

పీఎల్ఐ స్కీమ్ సూపర్ సక్సెస్.. ఉద్యోగాల కల్పనలో రికార్డు

భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక చర్యలు తీసుకుంటుంది. సాధారణంగా భారతదేశం జనాభా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇంత స్థాయిలో ఉన్న జనాభాకు ఉద్యోగ కల్పనకు తయారీ రంగం కీలకం అని భావించి కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ స్కీమ్ ద్వారా తయారీదారులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నారు. ఈ చర్యలు భారతదేశంలో ఉద్యోగ కల్పనలో రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో పీఎల్ఐ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం దేశంలో ఉద్యోగ కల్పనలో నయా …

Read More »

టీమ్-11తో మంత్రివర్గాన్ని ప్రకటించిన హేమంత్ సోరెన్.. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు దక్కిందంటే..!

జార్ఖండ్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని ఖరారు చేశారు. సోరెన్ కేబినెట్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా నుండి ఐదుగురు, కాంగ్రెస్ నుండి నలుగురు, RJD నుండి ఒకరు మంత్రి పదవులు పొందారు. జేఎంఎం కోటా నుంచి దీపక్ బిరువా, రాందాస్ సోరెన్, చమ్ర లిండా, యోగేంద్ర మహతో, హఫీజుల్ అన్సారీ, సుదివ్య సోను పేర్లను రాజ్‌భవన్‌కు పంపారు. కాంగ్రెస్ కోటా నుంచి ఇర్ఫాన్ అన్సారీ, దీపికా పాండే, శిల్పి నేహా టిర్కీ, రాధాకృష్ణ కిషోర్‌లకు …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌.. అదుపులోకి తీసుకున్న బంజారా హిల్స్ పోలీసులు

తమ ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి బుధవారం(డిసెంబర్ 4) బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు కౌశిక్‌ వెళ్లారు. అయితే, తనకు పని ఉందంటూ ఇన్‌స్పెక్టర్ వెళ్లిపోయారు. తన ఫిర్యాదు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ వెంటపడ్డారు MLA కౌశిక్ రెడ్డి. పైగా ఇన్‌స్పెక్టర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొండాపూర్‌లోని ఆయన నివాసం …

Read More »

ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన

అర్హులైన ప్ర‌తి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూట‌మి ప్ర‌భుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తోంద‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. బ‌డుగు, బ‌లహీన వ‌ర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాల‌కు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు సంబంధించి మంత్రి గొట్టిపాటి బుధ‌వారం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ల‌క్షలాది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా ల‌బ్ధి పొందుతున్నార‌ని తెలిపారు. 15,17,298 ఎస్సీ కుటుంబాలు, 4,75,557 ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో ల‌బ్ధిదారులుగా ఉన్నార‌ని మంత్రి …

Read More »

కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్

సూపర్-6 హామీలు అమలు చేయలేదు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని పోరుబాటకు సిద్ధమవ్వాలని వైసీపీ పార్టీ శ్రేణులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.. ఏపీలో పాలనపై అందరూ అసంతృప్తితో ఉన్నారని.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు సంధించారు.. బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో వైసీపీ చీఫ్ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హామీలు అమలు …

Read More »

భవిష్యత్తు అమరావతికి తొలి అడుగు.. అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇల్లు..!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో జాప్యం, రాజకీయ విమర్శలు, ఆర్థిక సమస్యలు మొదలైన వాటి మధ్య ఆయన రాజధాని అభివృద్ధి కోసం కొనసాగించిన కృషి ప్రశంసలకు పాత్రమైంది. అదే సమయంలో రాజధానిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదన్న విమర్శ తరచూ గట్టిగా వినిపిస్తూ వచ్చేది. ఈ విమర్శలకు సీఎం చంద్రబాబు ఇప్పుడు చెక్ పెట్టారు. త్వరలో సీఎం చంద్రబాబు ఇంటి చిరునామా మారబోతోంది. గత పదేళ్లుగా లింగమేనని అతిథిగృహంలో ఉంటున్న …

Read More »

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌.. ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌కు కీలక పదవులు..?

మహారాష్ట్ర కొత్త సీఎం క్లారిటీ వచ్చేసింది. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పేరును ఆమోదించారు. గురువారం(డిసెంబర్ 5) ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ అధికారికంగా ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌ రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత 11 రోజులుగా సాగుతున్న మహాయుతి హైవోల్టేజీ డ్రామా ఎట్టకేలకు ముగిసింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. పార్టీ …

Read More »