కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ముమ్మాటికి అవినీతి జరిగింది..! పీసీ ఘోష్ కమిషన్ కూడా అదే తేల్చింది..! కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిందేనంటూ సీబీఐకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం.. ఇటు సీబీఐ విచారణకు కాషాయపార్టీ కూడా పచ్చజెండా ఊపింది. కాళేశ్వరం అవినీతికి పూర్తి బాధ్యత కారుపార్టీదేనని హస్తం నేతలతో కలసి కమలంపెద్దలు గట్టిగానే వాదిస్తున్నారు. ఇక అదంతా అటుంచితే… సీబీఐ ఎంట్రీపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాష్ట్రంలోకి నో ఎంట్రీ ఉన్న సీబీఐ ఎలా వస్తుంది..? వస్తే ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. …
Read More »కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర.. వారిద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు.. కవిత సంచలన ఆరోపణలు..
కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే హరీశ్‌ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లు తెలిపారు. హరీశ్, సంతోష్ వల్లేనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయని అన్నారు. వాళ్ల స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారన్నారు. వారిద్దరి వెనక సీఎం రేవంత్ ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపడం దారుణమన్నారు. దమ్ముంటే హరీష్, సంతోష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాపై కుట్రలు చేసినా సహించా.. కానీ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నానని …
Read More »దేశవ్యాప్తంగా తెలుగు వెలగాలంటే సుదర్శన్ రెడ్డి గెలవాలి.. సీఎం రేవంత్ కీలక కామెంట్స్
నీలం సంజీవరెడ్డి , పీవీ నరసింహరావు, జైపాల్ రెడ్డి ,వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ వంటి తెలుగు నేతలు గతంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు మరోసారి తెలుగు వ్యక్తికి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందని.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎజెండా, జెండా లేకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంతా మద్దతివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సీబీఐ విచారణ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. కాళేశ్వరం కేసును సీబీఐకు అప్పగిస్తున్నట్టు సీఎం రేవంత్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. దర్యాప్తుకు సభ ఏకగ్రీవంగా నిర్ణయించింది. నిజాయితీతో విచారణ జరగాలని ఆశిస్తున్నట్టు సీఎం రేవంత్ అన్నారు. ఆ వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై తొమ్మిదిన్నర గంటల సుదీర్ఘ చర్చ సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రకటన చేశారు. కాళేశ్వరం కేసును …
Read More »దుమ్ము దుమారమే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. మొత్తం ఎన్ని రోజులంటే..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. కాళేశ్వరం రిపోర్ట్ ఆధారంగా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది అధికార పార్టీ. కాళేశ్వరంపై ప్రభుత్వం కుట్రలను సభ సాక్షిగా తిప్పికొడతామంటోంది బీఆర్ఎస్. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ అవినీతిని అసెంబ్లీలో కడిగేస్తామంటోంది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తామంటోంది …
Read More »యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆందోళన
తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. అసెంబ్లీ ముందు గన్‌పార్క్‌లో నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీష్‌రావు ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపగా.. మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ యూరియాపై ఆందోళన చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్‌పార్క్‌కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు …
Read More »ప్రజలకు సమాధానం చెప్పలేకే.. అలా చేస్తున్నారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో సీఎంపై జగదీష్ రెడ్డి కామెంట్స్!
TV9 క్రాస్‌ఫైర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం ప్రతిపక్షాలపై వ్యక్తిత్వ హననం చేస్తుందన్నారు. కేసీఆర్..రెండేళ్లలో ఒక్కరోజూ రేవంత్‌పై మాట్లాడలేదు.. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు తీయని రోజు ఉందా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. TV9 క్రాస్‌ఫైర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం ప్రతిపక్షాలపై వ్యక్తిత్వ హననం …
Read More »ఏఐ టెక్నాలజీతో వీడియోలు క్రియేట్ చేశారు.. ఓయూకు మళ్లీ వస్తా.. ఒక్క పోలీస్ ఉండొద్దు..
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని.. 4 కోట్ల తెలంగాణ వాసుల గళం ఉస్మానియా అని.. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.. నిజాంకు వ్యతిరేకంగా పీవీ నరసింహారావు.. ఓయూ గడ్డమీద నుంచే ధిక్కారస్వరం వినిపించారన్నారు. పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, జార్జిరెడ్డి, గద్దర్‌లను తెలంగాణకు అందించిన విశ్వవిద్యాలయం ఓయూ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.. తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా సంక్షోభం వచ్చినా చర్చ ఇక్కడే జరుగుతుంది.. తెలంగాణలో సమస్య ఏదైనా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందన్నారు. సోమవారం ఉస్మానియా …
Read More »సీఎం రమేష్ ఇంటికి నేను కూడా వెళ్లా.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ఏమన్నారంటే?
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. బీజేపీతో పొత్తుకోసం కేటీర్ తమను కలిశారన్న సీఎం రమేష్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్టీవిలీనంపై సీఎం రమేశ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. సీఎం రమేష్ ఇంటికి నేనుకూడా వెళ్లానని.. అంత మాత్రానా పొత్తు పెట్టుకున్నట్టా అని ప్రశ్నించారు. సీఎం రమేష్ ఇంటి సీసీ ఫుటేజీ బయట పెట్టాలి డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. పార్టీవిలీనంపై …
Read More »ఫిరాయింపులపై యాక్షన్ షురూ చేసిన తెలంగాణ స్పీకర్.. ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ!
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పంపించారు. స్పీకర్ నోటీసులపై గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ 3 నెలల్లోగా తన దగ్గరకు వచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న …
Read More »