పాలిటిక్స్

నేతలకు 2 టార్గెట్స్, 2 వార్నింగ్స్ ఇచ్చిన ఖర్గే

నేతలంతా ఐక్యంగా ఉండాలి. అంతా ఒక్కతాటిపైకి వచ్చి ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి. ఇదీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే టి కాంగ్రెస్ నేతలకు చేసిన సూచనలు. అదే సమయంలో నాయకులకు గట్టిగా వార్నింగ్‌లు కూడా ఇచ్చారు ఖర్గే. ఆ డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.. ఒక రోజంతా హైదరాబాద్‌లో బిజీబిజీగా గడిపారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నేతలతో వరుస సమావేశాలు, పార్టీ ఆఫీస్‌లో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని విపక్షాలను టార్గెట్ చేశారు. అయితే పార్టీ అంతర్గత సమావేశాల్లో …

Read More »

అనారోగ్యం నుంచి కోలుకున్న కేసీఆర్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి..

యశోద ఆస్పత్రి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. షుగర్, సోడియం లెవెల్స్ కంట్రోల్లోకి రావడంతో పాటు జ్వరం కూడా తగ్గడంతో ఆయన సాధారణ స్థితికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండు రోజుల పాటు ఆయన నందినగర్ నివాసంలో ఉండనున్నారు. కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. గత రెండు రోజులుగా ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే షుగర్, సోడియం లెవెల్స్ కంట్రోల్‌లోకి  వచ్చాయి. జ్వరం కూడా తగ్గడంతో ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చింది. దీంతో …

Read More »

తెలంగాణ బీజేపీ చీఫ్‌‌గా బాధ్యతలు స్వీకరించిన రామచందర్‌రావు..

తెలంగాణ బీజేపీ చీఫ్‌ గా రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ డీకే ఆరుణ, బీజేపీ MLAలు హాజరయ్యారు. అంతకముందు చార్మినార్‌ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయానికి వళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు రామచందర్‌రావు. వెంటనే అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం నాంపల్లిలోని పార్టీ ఆఫీసుకు ర్యాలీగా వచ్చారు.

Read More »

వరంగల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటి

మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. కొండా ఫ్యామిలీపై పలు ఆరోపణలు రాగా.. వారి కూతురు ఏకంగా పరకాల నుంచి పోటీకి సిద్ధమవుతున్నానంటూ వ్యాఖ్యానించి పొలిటికల్ హీట్ పెంచారు. ఈ క్రమంలో కొండా దంపతులు మీనాక్షిని కలిశారు. వరంగల్ రాజకీయాలకు సంబంధించి పలు కీలక విషయాలను మీనాక్షికి వివరించారు.తెలంగాణలో వరంగల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గతంలో సమంత విషయంలో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వివాదస్పద చేయగా.. ఇటీవలే ఆమె భర్త కొండా మురళీ.. …

Read More »

మనుషుల ప్రాణాలంటే జగన్‌కు లెక్కలేదు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

జగన్‌కు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదన్నారు సీఎం చంద్రబాబు. తన కారు కింద పడి మనిషి చనిపోయినా రాజకీయం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలతో ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిందన్నారు చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. పది లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు. సీఎంగా 15 ఏళ్ల అనుభవం ఉన్న తనకే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఏడాది సమయం …

Read More »

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు ఏకగ్రీవం!

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఏబీవీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మన్నగూడలో జరిగే సన్మాన సభలో రాంచందర్ రావును అధ్యక్షుడిగా సంస్థాగత ఎన్నికల అధికారి శోభ కరండ్లాజే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన్నేడలో ఏర్పాటు చేసిన స్మాన సభకు భారీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. వీరితో పాటు తెలంగాణ కీలక బీజేపీ నేతలు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ర్యాలీగా కార్యకర్తలతో …

Read More »

బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.. నెక్స్ట్ ఏం జరగనుంది..

బనకచర్ల ప్రాజెక్ట్‌తో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు చేసిన ఫిర్యాదుల ప్రభావం కనిపిస్తోంది. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌కు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్‌పై పలు సందేహాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్ట్‌కు ఇప్పుడే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర …

Read More »

అమెరికా వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు.. సీఎం చంద్రబాబు వార్నింగ్‌‌తో సీన్ రివర్స్.. అసలేం జరిగిందంటే..

తానా, ఆటా సంబరాల్లో మునిగి తేలదామని టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు చలో అమెరికా అన్నారు. ఇంతలోనే సీఎం చంద్రబాబు ఇచ్చిన ఝలక్‌తో వాళ్లు తిరుగు టపా కట్టారు. చిల్‌ అవుదామని వెళ్లినవాళ్లకు గుండె ఝల్లుమంది. ఇంతకీ వాళ్లకు చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్‌ ఏంటి?.. అమెరికాలో తానా, ఆటా, నాటా సంబరాలు షురు కాబోతున్నాయి. వాటిలో ఆటాపాటాతో సందడి చేయడానికి దాదాపు 15మంది టీడీపీ ఎమ్మెల్యేలు అమెరికాకు వెళ్లారు. మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలని, పొలిటికల్‌ ప్రెజర్‌ కుక్కర్‌లో నుంచి బయటపడి, చిల్‌ అవుదామని చలో …

Read More »

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం.. బీజేపీకి రాజీనామా!

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారని ఆయన రోపించారు. ‘నేను రిజైన్ లెటర్ కిషన్ రెడ్డికి ఇచ్చాను. ఈ లెటర్ స్పీకర్ కు పంపించమని చెప్పానని ఆయన తెలిపారు. నాకు మద్దతుకు వచ్చిన వారిని బెదిరించారని ఆయన ఆరోపించారు. నాకు ముగ్గురు కౌన్సిల్ …

Read More »

 ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. ఖరారు చేసిన అధిష్ఠానం!

ఏపీలో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక కొలిక్క వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్‌.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. కాగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ కాసేపట్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇక బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం( 01-07-2025) అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు కర్ణాటక బీజేపీ ఎంపీ మోహన్‌ …

Read More »