బిగ్ బాస్ సెలబ్రిటీ నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేతృత్వంలో నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నూతన్ నాయుడికి కండువా కప్పి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ ద్వారా నూతన్ నాయుడు ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. అయితే ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో షర్మిల సమక్షంలో హస్తం పార్టీలోకి నూతన్ నాయుడు చేరారు. నూతన నాయుడు సినిమాల్లో నటించడంతో పాటుగా నిర్మాతగానూ …
Read More »టీడీపీకి షాక్.. క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీలో ఉన్న ఐదు స్థానాలకు గానూ ఐదింటినీ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం మంత్రి టీజీ భరత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తం ఐదు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాల అనంతరం ఎస్వీ కాంప్లెక్స్ వద్ద ఉన్న వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే …
Read More »పొలిటికల్ ఎంట్రీపై అలేఖ్య తారకరత్న..
అలేఖ్య తారకరత్న తాజాగా తన ఫాలోవర్లతో ఇన్ స్టాలో చిట్ చాట్ చేసింది. తన బర్త్ డే సందర్భంగా అలేఖ్య అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. బాలయ్య బాబు విష్ చేశాడా? అని ఓ నెటిజన్ అడిగితే.. విష్ చేయలేదు.. ఆయన బిజీగా ఉండి ఉంటారు అని సమాధానం ఇచ్చేసింది. ఇక విజయ సాయి రెడ్డి మీద వస్తోన్న రూమర్ల మీద, నందమూరి కుటుంబం దూరం పెట్టడం.. నారా లోకేష్ ఆర్థిక సాయం ఇలా అనేక అంశాల మీద అలేఖ్య సమాధానం చెప్పింది. …
Read More »ప్రతిపక్ష నేత హోదా కోరుతూ వైఎస్ జగన్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏజీ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ విన్నవించారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్ జగన్ తరఫున లాయర్ తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని.. …
Read More »ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గృహ నిర్మాణ శాఖపై సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రి పార్థసారథితో కలిసి ఆయన గృహ నిర్మాణ శాఖ మీద సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇళ్ల స్థలాల పంపిణీలో చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో …
Read More »జనసేన పార్టీ సరికొత్త రికార్డ్.. అంతకు మించి..?
జనసేన పార్టీ సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ నెల 18న సభ్యత్వ నమోదు ప్రారంభంకాగా.. ఇప్పటి వరకు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని నేతలు తెలిపారు. దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. మరో వారం పాటూ సభ్యత్వ నమోదుకు గడువును పెంచామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించి.. ప్రతి నియోజకవర్గంలోనూ 5 వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కృషి చేద్దామన్నారు. గత ఏడాది …
Read More »పారిస్ ఒలింపిక్స్‌లో బీజేపీ మహిళా ఎమ్మెల్యే..
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. అయితే తొలిరోజు భారత క్రీడాకారులు నిరాశపరిచారు. ఈ క్రమంలోనే పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన వారిలో ఓ బీజేపీ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆమెనే బీహార్‌కు చెందిన శ్రేయాసీ సింగ్. బీహార్ 2020 ఎన్నికల్లో జముయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాసీ సింగ్.. భారత షూటింగ్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు ఎన్నికయ్యారు. పారిస్ ఒలింపిక్స్ కోసం వెళ్లిన 117 మంది భారతీయ క్రీడాకారుల్లో శ్రేయాసీ సింగ్ కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే షూటింగ్ …
Read More »యంగ్ మినిస్టర్.. మీ నాన్న నాకు క్లోజ్ ఫ్రెండ్.. లోక్‌సభలో ఆసక్తికర దృశ్యం
కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయడు.. మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాతో కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు.. మోదీ మంత్రివర్గంలో అతి పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే రామ్మోహన్ నాయుడు గురించి ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ …
Read More »చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే..
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వ పాలన చూస్తుంటే.. రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా.. రివర్స్ వెళ్తోందా అనే అనుమానం కలుగుతోందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్లను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని.. బాధితులపై కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక పాలన, ఆటవిక పాలనగా మారిందని.. ఏపీలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు …
Read More »వైఎస్ జగన్‌కు ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో….?
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. వినుకొండ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నాగబాబు వీడియో విడుదల చేశారు. వినుకొండ రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్న నాగబాబు.. పాత పగల కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో రషీద్ హత్యకు …
Read More »