పాలిటిక్స్

వచ్చి తీరతా… ఎలా వస్తావో నేనూ చూస్తా… తాడిపత్రిలో టెన్షన్‌.. టెన్షన్‌..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్తానంటున్నారు పెద్దారెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదంటూ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి సొంతూరు తిమ్మంపల్లితోపాటు తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. మరి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తారా? పోలీసులు అడ్డుకుంటారా? ఏం జరగనుంది? అనేది ఆసక్తిగా మారింది. ఇవాళ చంద్రబాబు మేనిఫెస్టో …

Read More »

గవర్నర్‌ ఆమోదిస్తారా..? నెక్స్ట్ ప్లాన్ ఏంటి..? బీసీ రిజర్వేషన్ల చుట్టూ పొలిటికల్ వార్..

తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ నిర్ణయం కీలకం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపితేనే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నర్‌ తిరస్కరించడమో లేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే రిజర్వేషన్ల పెంపు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం పెడతారా…? లేక న్యాయ, రాజ్యాంగ పరిశీలనకు పంపుతారా…? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రాజ్యాంగ పరిశీలనకు పంపిస్తే మాత్రం నిర్ణయం …

Read More »

ఇవాళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ… బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ప్రధాని మోదీతో రేవంత్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మోదీతో చర్చించే ఛాన్స్ ఉంది. ప్రధానితో భేటీ అనంతరంర ఆయన సాయంత్రం హైదరాబాద్‌ చేరుకోనున్నారు. సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థలతో పాటుగా, విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. అసెంబ్లీలో తీర్మానం పాస్‌ చేసి కేంద్రానికి కూడా పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచుకునేందుకు …

Read More »

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్‌ సరైనదే… బీఆర్‌ఎస్‌ వాళ్లు నా దారికి రావాల్సిందే: చిట్‌చాట్‌లో కవిత

ఎమ్మెల్సీ కవిత చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్‌ సరైనదేనని వెనకేసుకొచ్చారు. ఆర్డినెన్స్‌ వద్దని బీఆర్ఎస్‌ నేతలు చెప్పడం తప్పు అంటూ సొంత పార్టీనే విమర్శించారు కవిత. నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్‌కు మద్దతిచ్చానని చెప్పారు కవిత. BRS వాళ్లు నా దారికి రావాల్సిందేనని అన్నారు. తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్.. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తోన్న అంశమిది. …

Read More »

ఏ క్షణమైనా సర్పంచ్‌ ఎన్నికల షెడ్యూల్… రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం

తెలంగాణలో స్థానికసంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమైంది. హైకోర్టు గడువులోపు ఎన్నికలు పూర్తిచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సర్కార్ సూచించింది. ఇప్పటికే ZPTC, MPTC, సర్పంచ్‌ స్థానాలు ఖరారు చేసింది. ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటా కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్‌ …

Read More »

బండి సంజయ్‌కి మరోసారి సిట్‌ నోటీసులు… విచారణ కు సమయం ఇవ్వాలని కోరిన పోలీసులు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు రాక తరువాత ఈ కేసు విచారణలో సిట్ మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. విచారణలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి సిట్‌ మరోసారి నోటీసులు పంపింది. విచారణకు సమయం ఇవ్వాలని సిట్‌ అధికారులు నోటీసుల్లో కోరారు. దీంతో ఈనెల 24న విచారణకు బండి సంజయ్‌ సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బండి సంజయ్‌ని సిట్‌ అధికారులు …

Read More »

ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన… రెండు రోజుల పాటు ఏమేం చేశారంటే…

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి కర్నూలుకు బయలుదేరారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. అమరావతి నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులు వంటి పలు కీలక విషయాలపై వినతులు అందించారు. కేంద్రమంత్రులు అమిత్‌ షా, అశ్వినీ వైష్ణవ్‌, మాండవీయ, నిర్మలాసీతారామన్‌, పాటిల్‌తో భేటీ అయ్యారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి …

Read More »

మూడున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోవడం ఖాయం… ప్రెస్‌మీట్‌లో జగన్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని అరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు జగన్‌. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉండేది వైసీపీనేనని గుర్తు చేశారు. రైతుభరోసా నిధుల కోసం అన్నదాతకు అండగా ధర్నా చేశామన్నారు. కరెంట్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ పోరుబాట చేపట్టామని జగన్‌ చెప్పుకొచ్చారు. యువత పోరు పేరుతో ఆందోళనలు చేపట్టాం.. చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం నిర్వహించాం.. బాబు షూరిటీ-మోసం …

Read More »

అశోక్‌ గజపతిరాజుపై వైసీపీ నేత పొగడ్తల వర్షం… గవర్నర్ పదవి ఇవ్వడంపై అప్పలనాయుడు హర్షం

గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్‌ గజపతిరాజుపై వైసీపీ నేత పొగడ్తల వర్సం కురిపించారు. గవర్నర్ పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు వైసీపీ నెల్లిమర్ల ఇన్‌చార్జ్ బడ్డుకొండ అప్పలనాయుడు. గజపతిరాజు ఈ ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిన మహానుభావులు అంటూ కొనియాడారు. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టే ఉన్నతమైన పదవులు దక్కాయని చెప్పారు వైసీపీ నేత అప్పలనాయుడు. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ కావడం సంతోషంగా ఉందన్నారు. అశోక్‌ గజపతిరాజు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నారని అన్నారు. పదవి ఇచ్చిన బీజేపీకి ధన్యవాదాలు …

Read More »

వైసీపీ సింబల్‌ మార్పు ప్రచారం ఫేక్‌.. ఈసీకి ఎలాంటి లేఖ రాయలేదన్న అధిష్టానం!

వైసీపీ పార్టీ సింబల్‌ మార్పుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమన వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది. వైసీపీ పార్టీ చిహ్నాన్ని మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ పార్టీ గుర్తును మార్చాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశాసినట్టు ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో …

Read More »