పాలిటిక్స్

పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌కు కేటీఆర్ లీగల్‌ నోటీసులు.. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ..

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించడం కాక రేపుతోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు మహేష్‌కుమార్‌గౌడ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేయడం ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్. ఓ సారి లుక్కేయండి మరి.ఫోన్ ట్యాపింగ్ పేరుతో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేశ్‌కుమార్ గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు …

Read More »

టీవీ9 క్రాస్‌ఫైర్‌లో ఈటల కామెంట్స్‌పై బీజేపీ చర్చ.. అంతా కేబినెట్ నిర్ణయం మేరకే అంటూ..

టీవీ9 క్రాస్ ఫైర్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. అంతా కేబినెట్ నిర్ణయం మేరకే అంటూ గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడారని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. తన పార్టీ నిబద్ధతను, రాజకీయ ప్రత్యర్థులపై తన వైఖరిని స్పష్టం చేస్తూ.. ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరంపై ఈటల కామెంట్స్‌ కాకరేపుతున్నాయి. టీవీ9 క్రాస్ ఫైర్‌లో చెప్పిన కొన్ని అంశాలు బీఆర్‌ఎస్‌కు …

Read More »

జూనియర్‌ NTR క్రేజ్‌ చూసి అసదుద్దీన్‌ ఒవైసీ షాక్‌..! MIM మీటింగ్‌లో పేరు చెప్పగానే దద్దరిల్లిన..

ఒక AIMIM సభలో అసదుద్దీన్ ఒవైసీ జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడంతో సభ దద్దరిల్లిపోయింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ రాజకీయాలపై విమర్శలు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ పాపులారిటీకి ఒవైసీ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. తన టాలెంట్‌తో బిగ్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు. యూత్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఉండే క్రేజ్‌ గురించి కొత్త చెప్పేందేముంది కానీ, ఓ మీటింగ్లో జరిగిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. …

Read More »

డియర్ మినిస్టర్స్‌.! మాట కొంచెం పొదుపు.. మంత్రులపై టీపీసీసీ సీరియస్‌..

డియర్ మినిస్టర్స్‌.. నోట్ దిస్ పాయింట్స్‌.. మీరు మంత్రులైనంత మాత్రాన అన్నీ మాట్లాడేస్తాం.. పక్క వాళ్ల శాఖలో కలగజేసుకుంటామంటే కుదరదు అంటోంది పీసీసీ. కోర్టులో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మంత్రులు కామెంట్స్‌ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పీసీసీ చీఫ్‌. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న అంశంపై ఎలా ప్రకటన చేస్తారని ఫైర్ అయ్యారాయన.కేబినెట్‌లో చర్చ జరగకుండానే స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రకటనలు చేయడంపై పీసీసీ సీరియస్ అయింది. కోర్టులో ఉన్న అంశాలపై ఎలా పడితే అలా మాట్లాడతారా? ఒకరి శాఖలో మరొకరు …

Read More »

కీలక మలుపు తిరిగిన కాలేశ్వరం విచారణ..! మంత్రులతో సీఎం రేవంత్‌ మీటింగ్‌

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన మలుపు తిరిగింది. కమిషన్ ప్రభుత్వాన్ని సంప్రదించి, ప్రాజెక్టుకు సంబంధించిన మంత్రివర్గ సమావేశాల నిమిత్తాలను అందించాలని కోరింది. నీటిపారుదల శాఖకు కూడా లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చర్చించి అధికారులకు అన్ని వివరాలు కమిషన్ కు అందించాలని ఆదేశించారు.కాళేశ్వరం కమిషన్‌ విచారణ కీలక మలుపు తిరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీష్‌, ఈటలను …

Read More »

అడ్డొస్తే తొక్కేస్తారా.. ఎవర్ని తొక్కుతారు? ఇక్కడుంది CBN..! సీఎం చంద్రబాబు మాస్‌ వార్నింగ్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, అడ్డుకుంటే తొక్కేస్తామని ప్లకార్డులు ప్రదర్శించారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్‌ను “నాటకాల రాయుడు” అని పిలుస్తూ, ఆయన రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ పొదిలి టూర్‌ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ విపక్షానికి చంద్రబాబు ఏకంగా వార్నింగ్‌ ఇచ్చారు. అడ్డొస్తే తొక్కేస్తామంటూ పొదిలిలో …

Read More »

తెలంగాణలో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్‌

మంత్రివర్గ విస్తరణ తరువాత సీఎం రేవంత్ రెడ్డి పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేసీఆర్, కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న వేళ.. రాజకీయంగా తన పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేపు తెలంగాణ మంత్రులతో సీఎం సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల …

Read More »

కొలిక్క వచ్చిన తెలంగాణ కేబినెట్ విస్తరణ?.. సాయంత్రంలోపు తుది నిర్ణయం వెలువడే ఛాన్స్‌

తెలంగాణ కేబినెట్ విస్తరణనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంలోపు కేబినెట్‌ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై తుది నిర్ణయం వెలువడనుంది.గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం మరోసారి అధిష్టానంతో భేటీ అయ్యి కేబినెట్‌ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావొస్తున్న ఇప్పటికీ ఇంకా కేబినెట్‌ విస్తరణ చేయలేదు. దీంతో పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి …

Read More »

వైసీపీకి బిగ్‌ షాక్‌.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మహిళా నేత!

కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీకి నిరంతర షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా, ఎమ్మెల్సీ, డిప్యూటీ ఛైర్ పర్సన్ పదవులకు రాజీనామా చేసి జకియా ఖానుం వైసీపీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. తిరుమల దేవస్థానం VIP టిక్కెట్ల అమ్మకం ఆరోపణలు, కూటమి నేతలతో జకియా సమావేశాలు వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరో ఒక నేత పార్టీకి వారి పదవికి రాజీనామా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో …

Read More »

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. బీజేపీలో చేరేందుకు మంతనాలు..!

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.. రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీలో చేరేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ విశ్వసనీయ సమాచారం అందుతోంది. బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే మంతనాలు కూడా జరుగుతున్నాయి. తాను రాజీనామా చేసిన రాజ్యసభ సీటు కాకుండా మరో పదవిపై విజయసాయిరెడ్డి దృష్టి పెట్టారు. ఏపీ రాజ్యసభ రేసులో లేనని ఇప్పటికే ప్రకటించిన విజయసాయిరెడ్డి.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.. విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారని పేర్కొంటున్నారు ఆయన …

Read More »