తమది ప్రజా ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరుగుతున్న “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా తణుకులోని ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చంద్రబాు నాయుడు చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజలు ఏమి చెప్పినా వినే ప్రభుత్వం తమదన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి, మీకు నాకు మధ్య పరదాలు లేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ …
Read More »తెలంగాణలో డీలిమిటేషన్ సెగలు.. కాంగ్రెస్ వ్యూహంపై బీఆర్ఎస్, బీజేపీ రియాక్షన్ ఇదే..p
డీలిమిటేషన్ అంశం.. తమిళనాడులోనే కాదు.. తెలంగాణలోనూ సెగలు పుట్టిస్తుంది. అఖిలపక్షంలో చర్చిద్దామని.. కాంగ్రెస్ అంటుంది. తమిళ రాజకీయ ట్రాప్‌లో పడ్డారని.. కమలం పార్టీ కస్సుబుస్సులాడుతున్న వేళ.. అసలు అఖిలపక్షం జరిగేదెప్పుడు.. వెళ్లేది ఎవరు?. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి..? డీలిమిటేషన్‌పై దక్షిణాది జంగ్ సైరన్ మోగిస్తున్న వేళ.. తెలంగాణకు కూడా ఈ సెగలు తాకాయి. డీలిమిటేషన్ పై అఖిలపక్షం నిర్వహిస్తామని అధికార కాంగ్రెస్ అంటుంది. 22న స్టాలిన్ భేటీ కంటే ముందే తెలంగాణలో అఖిలపక్ష భేటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్. కానీ.. మీటింగ్ ఎప్పుడు ఉంటుందో …
Read More »జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఆయన పేరును జనసేన అధినేత పవన్ ఫైనల్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన సోదరుడు నాగబాబు పేరును జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు దక్కే పదవిపై కొంతకాలంగా అనేక …
Read More »ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక రూలింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారని స్పీకర్ తెలిపారు. ఇందులో సభాపతిని, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారని పేర్కొన్నారు. లోక్‌సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది అవాస్తమన్నారు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక రూలింగ్ ఇచ్చారు. బెదిరింపులు, అభియోగాలతో జగన్ తనకు లేఖ రాశారన్నారు. ప్రతిపక్ష …
Read More »తుది దశకు చేరుకున్న ఏపీ బడ్జెట్ కసరత్తు.. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు.!
ఓ వైపు సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలు.. మరోవైపు అభివృద్ధి ప్రణాళికలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ దిశగా బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఆర్థిక మంత్రి కేశవ్‌తో కలిసి దీనికి తుది రూపు దిద్దుతున్నారు.ఏపీ బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ బడ్జెట్‌కు ముఖ్య లక్ష్యం రాష్ట్ర GSDP వృద్ధి రేటు 15 శాతం సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడమే. ఇందుకోసం మూలధన వ్యయాన్ని పెంచుతూ, …
Read More »హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళి అరెస్ట్.. ఏపీకి తరలింపు.!
ఏపీలో మరో పొలిటికల్ వికెట్ పడింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. పోసాని అరెస్ట్‌తో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి నిన్న రాత్రి నోటీసులు ఇచ్చారు. పోసానిని అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. పోసాని …
Read More »వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. జనసేనలోకి 20 మంది కార్పోరేటర్లు
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒంగోలులో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్లో 20 మంది కార్పొరేటర్లు, ఇద్దరు కో ఆప్షన్ మెంబర్లు వైసీపీ కండువాను మార్చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా ముద్రపడిన వారంతా జనసేన చేరారు. బాలినేని ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు కార్పొరేటర్లు.ఒంగోలు డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవ్‌తో పాటు పార్టీ …
Read More »ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
ప్రతిపక్ష హోదా విషయంలో తగ్గేదేలే.. అని వైసీపీ నేతలు అంటుంటే.. అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదేలే.. అంటున్నారు కూటమి నేతలు.. ఏపీ బడ్జెట్ సమావేశాల వేళ వైసీపీ-కూటమి నేతల మధ్య విపక్ష హోదా మరోసారి అగ్గి రాజేసింది. ప్రతిపక్ష హోదా మా హక్కు అని ఫ్యాన్ పార్టీ డిమాండ్ చేస్తుంటే.. అడుక్కుంటే LOP హోదా ఇవ్వరని కౌంటర్ ఇస్తోంది సర్కార్.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు గవర్నర్ నజీర్ ప్రసంగించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ.. స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణే లక్ష్యంగా …
Read More »ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా.. ఏపీ గవర్నర్ స్పీచ్ హైలైట్స్ ఇవే
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ కూడా హాజరయింది. జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేశారు. అటు గవర్నర్ ప్రసంగం వైసీపీ నేతల నినాదాల మధ్యే కొనసాగింది. సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ‘పెన్షన్లు రూ. 4 వేలకు పెంచాం. ఏడాదికి రూ. 3 …
Read More »ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. రేఖ గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా హిందీలో ప్రమాణం చేశారు. అలాగే.. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ సీఎం …
Read More »