బిజినెస్

మన మోదీయే బాస్.. భారత ప్రధానిపై ప్రపంచ నాయకుల ప్రశంసలు.. ఎవరేమన్నారంటే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సెప్టెంబర్ 17, 2025తో 75వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. గుజరాత్‌లోని మెహ్సానాలో జన్మించిన ప్రధాని మోదీ.. అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా.. కనీసం రెండు పూర్తి పదవీకాలాలను పూర్తి చేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా.. సరికొత్త చరిత్రను లిఖించారు. అలాగే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) …

Read More »

చైనా, భారత్‌పై సుంకాలు విధించండి! జీ7 దేశాలకు అమెరికా పిలుపు..

జీ7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో రష్యాపై ఆంక్షలు పెంచడం, రష్యన్ చమురు కొనుగోలుదారులపై సుంకాలు విధించడం గురించి చర్చ జరిగింది. అమెరికా తన మిత్రదేశాలకు రష్యన్ చమురు దిగుమతిని నిరోధించడానికి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం అందించడానికి స్తంభింపచేసిన రష్యన్ ఆస్తులను ఉపయోగించుకునే అంశం కూడా చర్చించారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చించేందుకు జీ7 దేశాలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో తన మిత్ర దేశాలకు అమెరికా ఒక కీలక పిలుపు ఇచ్చింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఏడు దేశాల …

Read More »

భారత్‌ – ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం..! సంతకాలు చేసిన ఇరు దేశాల ఆర్థిక మంత్రులు

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIA) పై సంతకం చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడులను ప్రోత్సహించి, వాణిజ్యాన్ని పెంచుతుంది. ఇది 1996 ఒప్పందానికి ప్రత్యామ్నాయంగా ఉంది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్, భారత ఆర్థిక మంత్రి సంతకం చేసిన కొత్త ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం రెండు దేశాల పెట్టుబడిదారుల మధ్య పరస్పర పెట్టుబడులను సులభతరం చేస్తుంది. భారత్‌ కొత్త పెట్టుబడి ఒప్పందాల నమూనాకు అనుగుణంగా, ఈ …

Read More »

ఇది కదా పండగంటే.. సామాన్యులకు బంపర్ బొనాంజా.. నిత్యవసర వస్తువులపై జీఎస్టీ ఎంత తగ్గిందంటే..

దసరా, దీపావళికి ముందు ప్రజలకు భారీ రిలీఫ్‌ ఉంటుందని ఎర్రకోట సాక్షిగా చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను నిజం చేస్తూ.. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకున్న జీఎస్టీ స్లాబ్స్‌ను ఎత్తేసి.. రెండే రెంటిండిని తెరపైకి తీసుకొచ్చింది. అందులో ఒకటి ఐదు శాతం, రెండోది 18శాతం. కొన్నింటిపై మొత్తం జీఎస్టీనే ఎత్తేసింది. సగటున ఓ కుటుంబానికి చూస్తే.. కనీసం 1500 నుంచి 2000 వరకూ ఆదా అవుతుందనే అంచనాలున్నాయ్‌.. ఇంట్లో కిరాణా మొదలు వివిధ రకాల వస్తువుల కొనుగోళ్ల విషయంలో మనకు …

Read More »

8 ఏళ్లలో 12 కోట్ల మంది కస్టమర్లు..ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అరుదైన ఘనత..!

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) తన 8 సంవత్సరాల సేవలలో 12 కోట్లకు పైగా కస్టమర్లను చేర్చుకుందని, బిలియన్ల కొద్దీ డిజిటల్ లావాదేవీలను విజయవంతంగా ప్రాసెస్ చేసి, దేశవ్యాప్తంగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిందని భారత ప్రభుత్వం తెలిపింది. ప్రారంభమైనప్పటి నుండి, IPPB ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక చేరిక కార్యక్రమాలలో ఒకటిగా అవతరించిందని కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1.64 లక్షలకు పైగా పోస్టాఫీసులు మరియు 1.90 లక్షలకు పైగా పోస్ట్‌మెన్ మరియు గ్రామీణ డాక్ సేవక్‌ల (GDS) …

Read More »

ఆ దేశంతో భారత్‌ బంధాన్ని మేం గౌరవిస్తున్నాం! పాక్‌ ప్రధాని ఆసక్తికర ప్రకటన

SCO శిఖరాగ్ర సమావేశంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడుతూ భారత్, రష్యా మధ్య సంబంధాలను పాకిస్థాన్ గౌరవిస్తుందని వెల్లడించారు. రష్యా నుండి భారత్‌కు చమురు సరఫరాలో తగ్గింపు ల గురించి కూడా సమాచారం వెలువడింది. పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడుతూ.. భారత్‌, రష్యా మధ్య సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుందని అన్నారు. బీజింగ్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆయన …

Read More »

చారిత్రాత్మక క్షణం..! తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్ అందుకున్న ప్రధాని మోదీ

భారతదేశం సెమీకండర్టర్ల రంగంలో వేగంగా కదులుతోంది. ప్రధానమంత్రి మోదీ మంగళవారం (సెప్టెంబర్ 2) ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం భారతదేశంలో తయారు చేసిన తొలి చిప్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు. మంత్రి వైష్ణవ్ విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్, నాలుగు ఆమోదించిన ప్రాజెక్టుల టెస్ట్ చిప్‌లను కూడా ప్రధాని మోదీకి అందించారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం భారతదేశంలో తయారు చేసిన తొలి చిప్‌ను ప్రధాన మంత్రి …

Read More »

మోడీనా మజాకానా.. చైనాలోనూ మన ప్రధానే ప్రధాన ఆకర్షణ.. సోషల్ మీడియాలో ఫస్ట్ ప్లేస్ లో ట్రెండింగ్

ప్రధాని మోడీ రెండో రోజు చైనా పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు, అక్కడ మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ , రష్యా అధ్యక్షుడు పుతిన్‌లను కలిశారు. ఇప్పుడు ప్రధాని మోడీకి సంబంధించిన వార్తలు చైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పుతిన్ కారులో కూర్చున్న తర్వాత.. మోడీ చైనీస్ సెర్చ్ ఇంజన్ బైడు , చైనీస్ ‘ట్విట్టర్’ వీబోలో అగ్రస్థానంలో ట్రెండింగ్‌ అవుతున్నారు. ప్రధాని మోడీ ప్రజాదరణ కేవలం భారతదేశం లేదా అమెరికా-బ్రిటన్ దేశాలకే పరిమితం కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఆయన …

Read More »

జీఎస్టీలో కీలక మార్పులు.. రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందా..? సెప్టెంబర్ 3న ఏం జరగనుంది..?

ఏ రేట్లు తగ్గుతాయి.. ఏవి పెరుగుతాయి.. మోదీ చెప్పినట్లు ప్రజలు డబుల్ దీపావళి జరుపుకుంటారా..? జీఎస్టీలో కీలక మార్పులు ఉంటాయా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే చర్చ సాగుతోంది. ఈ చర్చకు మరో నాలుగు రోజుల్లో సమాధానం దొరికే అవకాశం ఉంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంపైనే అందరి కళ్లు ఉండడానికి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోదీ చేసిన ప్రకటనే కారణం. జీఎస్టీలో కీలక సంస్కరణలు తీసుకొస్తామని.. కొన్ని వస్తువుల …

Read More »

ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరమ్‌కి హాజరైన మోడీ, ఇషిబా.. బహుళ రంగాల్లో భారీగా పెట్టుబడులు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్, చైనాల దేశాల్లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు టోక్యోకి చేరుకున్నారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత మోడీ జపాన్ లో పర్యటిస్తున్నారు. జపాన్‌తో వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత ప్రోత్సహించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం కావచ్చు. ఆగష్టు 30 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తన జపాన్ కౌంటర్ షిగెరు ఇషిబాతో వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్ పర్యటన సందర్భంగా.. ప్రధాన మంత్రి మోడీ X లో …

Read More »