భక్తి

ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు.. 

ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం రాత్రి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఎక్స్ వేదిక కీలక ట్వీ్ట్ చేశారు. ఈ గురు పూర్ణిమ రోజున, మీ అంతర్గత శ్రేయస్సు కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. మీరు సాధన చేయండి, ధ్యానం చేయండి, మీ మనస్సును ఒక అద్భుతం చేయండి.. మీ గురువు అనుగ్రహం మీతో ఉంటుంది.. …

Read More »

ఒక్క దాడి.. తెలుగు రాష్ట్రాల మధ్య వేడి.. రాముడి భూమిలో రణరంగం..

ఏపీలో విలీనం కారణంగా… భద్రాద్రి రాముడితో పాటు భద్రాచల వాసులకూ కష్టాలొచ్చి పడ్డాయి. రోజూ పేరుకుపోతున్న చెత్తను ఎక్కడ డంప్‌ చేయాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ఎందుకంటే భద్రాచలం పట్టణం చుట్టూ ఉన్న నాలుగు రెవెన్యూ గ్రామాలతో పాటు ఒక పంచాయతీని ఏపీలో విలీనం చేశారు. భద్రాచలం పట్టణాన్ని మాత్రమే తెలంగాణలో ఉంచి, చుట్టుపక్కల ప్రాంతాలను ఏపీలో కలిపారు. అలా ఏపీలో కలిపిన ప్రాంతాల్లో ఒకటే పురుషోత్తపట్నం.. అసలు అలజడంతా జరుగుతున్నదీ అక్కడే. రెండేళ్ల క్రితం.. సరిగ్గా చెప్పాలంటే 2023 అక్టోబర్‌లో భద్రాచలం …

Read More »

హైదరాబాద్ చేరువలో వెలిసిన కైలాసం.. నీటి గుహను దాటి శివయ్య దర్శనం..

భూకైలాశ్ దేవాలయం.. హైదరాబాద్ నుంచి దాదాపుగా 110 కి.మీ. దూరంలో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన దేవాలయం. భాగ్యనగరం నుంచి కేవలం ఒక్క రోజులో వెళ్లి రావచ్చు. మరి ఈ దేవాలయం విశిష్ట ఏంటి.? ఇక్కడికి ఎలా చేరుకోవాలి.? ఖర్చు ఎంత అవుతుంది.? తాండూరు పట్టణానికి సమీపంలో ఉన్న భూకైలాశ్ దేవాలయం దాని అద్భుతమైన నిర్మాణం. దీని  ప్రత్యేకతల కారణంగా తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రధాన ఆకర్షణ ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇవి ఒక ప్రత్యేకమైన జలాల మధ్య ఉంచబడ్డాయి. భక్తులు ఈ …

Read More »

ఇషా ఫౌండేషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి జువల్‌..! గ్రామీణాభివృద్ధిలో ఇషా కృషికి ప్రశంసలు..

ఇషా ఫౌండేషన్ మద్దతుతో తమిళనాడులోని గిరిజన మహిళలు ఆర్థికంగా స్వతంత్రులై, పన్నులు చెల్లిస్తున్నారు. రూ.200లతో ప్రారంభించిన వ్యాపారాలు కోట్లలో టర్నోవర్‌ను సాధించాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువెల్ ఓరం ఈ మహిళల ప్రగతిని ప్రశంసించారు. ఇషా ఫౌండేషన్ గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ఇషా ఫౌండేషన్ మద్దతుతో గిరిజన మహిళలు లక్షాధికారులుగా మారడం, ఇప్పుడు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు విక్షిత్ భారత్‌కు మార్గం సుగమం చేస్తాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సద్గురు దార్శనికతను నెరవేరుస్తాయని కేంద్ర గిరిజన …

Read More »

హస్తినలో ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు.. ఇండియా గేట్ వద్ద విరిసిన తెలంగాణ సంస్కృతీ శోభ..

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వాటి నుంచి బోనాలు, బతుకమ్మ సహా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తెలంగాణ పండుగలను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు జరగని వేడుకలు సైతం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంతో వైభవంగా తెలంగాణ పండుగలు ఢిల్లీలో జరుగుతున్నాయి. జూన్‌ 30 సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ధూంధాంగా నిర్వహించారు.11 ఏళ్లుగా సింహవాహిని శ్రీ మహంకాళి …

Read More »

తెలంగాణ కుంభమేళ.. మేడారం మహా జాతర తేదీలు ఖరారు.. ఎప్పుడంటే

30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. మూడో రోజునే గద్దెలపై కొలువుదీరి ఉన్న సమ్మక్క, సారలమ్మ వనదేవతలు, గోవింద రాజు, పగిడిద్దరాజుల వారి వన ప్రవేశం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మేరకు పూజారులు తేదీలను నిర్ణయించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది.ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది మేడారం మహా జాతర.. ఈ మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే …

Read More »

బోనమెత్తిన భాగ్యనగరం.. బోనం అంటే ఏమిటి? ప్రాముఖ్యత.. బోనాల జాతర ఎప్పుడు మొదలైందంటే..

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్‌ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి చల్లగా చూడమని కోరుకుంటారు. ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది. ఆషాడ మాసం మొదటి గురువారం గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మకు తొలిబోనం సమర్పించడంతో బోనాల సంబురాలు షురూ అయ్యాయి.ఆషాడ మాసం రాకతో తొలకరి జల్లులతో పాటు తెలంగాణలో బోనాల సందడిని తెచ్చింది. మహిళలు …

Read More »

బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు

తెలంగాణలో బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్‌ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి.. సల్లంగా చూడమని వేడుకుంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది కూడా బోనాల సంబురం మొదలు కాగా.. వచ్చే నెల 24న ముగుస్తాయి. బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర ప్రారంభం నేపథ్యంలో తొలి …

Read More »

కోరిన కోర్కెలు తీర్చే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్య నగరంలోని బోనాల సందడి మొదలవుతుంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళికి తోలి బోనం సమర్పిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కూడా బోనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాల సందర్భంగా ఇక్కడ కొలువైన అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో మహిళలు చేరుకుంటారు. ఈ పురాతన ఆలయంలో ఏ దేవతను పూజిస్తారు? ఈ ఆలయంతో సంబంధం వెనుక ఉన్న నమ్మకం ఏమిటో తెలుసుకుందాం. ఏ దేవతని పూజిస్తారంటే.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రధానంగా ఆదిశక్తి …

Read More »

హైదరాబాద్‎లోనే జగన్నాథుడి దర్శనం.. పూరి వెళ్ళలేనివారికి బెస్ట్..

పూరి.. చార్‌ధామ్ యాత్రలో ఒకటి. అయితే హైదరాబాద్ వాసులు చాలామంది దూరం, బడ్జెట్ కారణంగా వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారికోసం ఆ జగన్నాథుడు భాగ్యనగరంలో కూడా దర్శనం ఇస్తున్నాడు. మరి హైదరాబాద్‎లో పూరి జగన్నాథ ఆలయం ఎక్కడ ఉంది.? ఈ టెంపుల్ చరిత్ర ఏంటి.? హైదరాబాద్‎లోని శ్రీ జగన్నాథ ఆలయం కళింగ కల్చరల్ ట్రస్ట్ అద్భుతమైన సృష్టి. ఈ పవిత్ర స్థలం ప్రజల మనస్సులలో హృదయాలలో దైవిక ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఇది అచ్చం పురిలో ఉన్న టెంపుల్ మాదిరిగానే ఉంటుంది. పూరి వెళ్లలేము అనుకునేవారికి ఇది మంచి ఎంపికనే చెప్పవచ్చు.  …

Read More »