సినిమా

హరితేజను బుక్ చేసేశారుగా..ఈ వారం నామినేషన్స్ ఫుల్ లిస్ట్ ఇదే.. ఏకంగా 9 మంది

బిగ్‌బాస్ 7వ వారం నామినేషన్స్‌లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. దాని కంటే ముందు ప్రోమో 2పై ఓ లుక్కేద్దాం. ప్రోమో 2లో ముందుగా తేజను నామినేట్ చేసింది యష్మీ. ఆయన నుంచి ఫన్ నేను అనుకున్నంత రాలేదు అంటూ యష్మీ చెప్పింది. దీనికి అవాక్కైన తేజ.. అసలు నేను మా క్లాన్‌తో ఎలా ఉన్నానో యష్మీకి తెలీనే తెలీదంటూ తేజ చెప్పాడు. అయితే బీబీ హోటల్ టాస్కులో తేజ క్యారెక్టర్ నుంచి బయటికొచ్చాడంటూ …

Read More »

నీ యవ్వా ఇది నామినేషన్ అంటే.. పూనకంతో ఊగిపోయిన అవినాష్..ప్రోమో అదుర్స్

బిగ్‌బాస్ ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో కంటెస్టెంట్ల మధ్య మాటాలదాడి మాములుగా లేదు. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియకి సరికొత్త థీమ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ప్రశాంతంగా సాగే ప్రయాణంలో ఇంటి సభ్యులందరిలో నుంచి ఎవరు నామినేట్ అవుతారనేది ఇద్దరు కిల్లర్ గర్ల్స్ అయిన హరితేజ-ప్రేరణపైన ఆధారపడి ఉంటుంది.. ప్రతిసారి గుర్రం సౌండ్ వినిపించినప్పుడల్లా ఇద్దరు కిల్లర్ గర్ల్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి హ్యాట్‌ను (టోపీ) పట్టుకోవాల్సి ఉంటుంది.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అంటే హ్యాట్‌ను ఎవరైతే …

Read More »

జిగ్రా విషయంలో ఏం జరుగుతోంది.. నిర్మాత భార్యపై కరణ్ కౌంటర్లు

కరణ్ జోహర్ నిర్మించిన జిగ్రా మూవీతో అలియా భట్ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. జిగ్రా చిత్రం ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. ఓ వైపు శ్రద్దా కపూర్ స్త్రీ 2 ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలియా భట్ జిగ్రా మూవీ డిజాస్టర్‌గా నిలిచేట్టుంది. అలియా భట్ జిగ్రా మూవీ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఈ మూవీ నార్త్ ఆడియెన్స్‌కి కూడా ఎక్కలేదు. తెలుగులో భారీగానే ప్రమోషన్స్ చేశారు. కానీ తెలుగులో జిగ్రాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అన్ని చోట్ల థియేటర్లు ఖాళీగానే దర్శనమిస్తున్నట్టుగా తెలుస్తోంది. …

Read More »

పండుగ రోజున చంద్రబాబు ఇంటికి చిరంజీవి.. అసలు కారణమదే..

మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి శనివారం సాయంత్రం వచ్చారు చిరంజీవి. చంద్రబాబును కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళం తాలూకు చెక్ అందజేశారు. విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తన తరుఫున రూ.50 లక్షలు, రామ్ చరణ్ తరుఫున మరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని శనివారం రోజున చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. ఇక …

Read More »

Pushpa 2 Collections: అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’.. బ్రేక్‌ ఈవెన్‌కి ‘బాహుబలి 2’ ని క్రాస్‌ చేయాల్సిందే!

తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప 2 అప్పుడే పలు ఏరియాల్లో అమ్ముడు పోయిందని వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో దాదాపుగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. అందుకే పుష్ప 2 వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అనే అభిప్రాయంతో అంతా ఉన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయింది మొదలుకుని …

Read More »

పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు షాయాజీ షిండే భేటీ.. అద్భుతమైన ఐడియా

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో సినీ నటుడు షాయాజీ షిండే సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షిండే వ్యాఖ్యానించారు. ఇటీవల తన ఆలోచనను పవన్‌ కళ్యాణ్‌తో పంచుకుంటానని ఓ టీవీ కార్యక్రమంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చిన షాయాజీ షిండే పవన్ కళ్యాణ్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. వీరి సమావేశానికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ కార్యాలయం ఎక్ (ట్విట్టర్) వేదికగా …

Read More »

 జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు రద్దు.. బిగ్ షాక్

Jani Master Case: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించిన షాక్ తగిలింది. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. 2022 సంవత్సరానికి గానూ తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు (తిరుచిట్రంబలం) సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్‎గా జానీ మాస్టర్‌ను నేషనల్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కాగా.. అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ జరగనుంది. అయితే.. రిమాండ్ ఖైదీగా చంచల్ గూడా …

Read More »

నాగార్జున హీరో కాదు విలన్.. ఆ ఒక్క కారణంతోనే మంత్రిని ఇబ్బంది పెడుతున్నారు: తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చిత్ర సీమలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మీద విమర్శలు చేసే క్రమంలో.. నాగచైతన్య, సమంత విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను అటు రాజకీయ నాయకులతో పాటు తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి చాలా మంది ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా.. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే.. ఈ …

Read More »

ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదు:కొండా సురేఖ

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం (అక్టోబర్ 2) చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ఆమె అక్కినేని నాగార్జున కుటుంబం, హీరోయిన్ సమంత పేరు తెరపైకి తీసుకొచ్చారు. వారి వ్యకిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్న సురేఖ.. మరో మహిళపై ఇటువంటి కామెంట్స్ …

Read More »

సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. మండిపడ్డ ఎన్టీఆర్, నాని, అమల, అఖిల్

మంత్రి కొండా సురేఖ తనను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారని తెగ బాధపడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ గురించి చెప్పాలనే ఉద్దేశంలో.. సమంత, అక్కినేని ఫ్యామిలీల మీద బుదర జల్లింది. సమంత, అక్కినేని ఫ్యామిలీను కేటీఆర్ వాడుకున్నాడని, బెదిరించాడని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడేసింది కొండా సురేఖ. దీంతో అక్కినేని ఫ్యామిలీ, సమంత తీవ్రస్థాయిలో మండపడింది. ఓ మంత్రి అయి ఉండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు.. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా ముందు ఇలా బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరిస్తారని మండి పడ్డారు. కొండా …

Read More »