Business

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

డైలీ 1.5 GB డేటా.. జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ ఏది చీప్.. దేంట్లో ఎంత రీఛార్జ్ చేయాలి?

Daily 1.5 GB Data Plans: తక్కువ ధరల్లోనే అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్‌లు అని రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చి దేశంలో కొన్నేళ్ల కిందట రిలయన్స్ జియో సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. జియో రాకతో.. జనం దీనికి అలవాటుపడ్డారు. దెబ్బకు ఎయిర్‌టెల్, వొడాఫోన్- ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటివి కుదేలయ్యాయి. వీటి సబ్‌స్క్రైబర్లు భారీగా తగ్గి మెజార్టీ సంఖ్యలో జియోకు మారిపోయారు. కొంతకాలం బాగానే నడిచినా.. తర్వాత్తర్వాత జియో బాటలోనే అన్నీ పయనించాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాగే రీఛార్జ్ ప్లాన్లు కూడా. ముందుగా …

Read More »

కుప్పకూలిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు రూ. 1.22 లక్షల కోట్ల నష్టం.. ముంచేసిన టీసీఎస్, రిలయన్స్, ఎల్ఐసీ

Stock Market Today: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. స్టాక్ మార్కెట్ సూచీలు ఒకే దిశలో ముందుకు దూసుకెళ్లాయన్న సంగతి తెలిసిందే. మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుతో ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. దీంతో రికార్డు స్థాయిలో షేర్ల కొనుగోళ్లు జరగ్గా.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ వరుసగా పెరుగుకుంటూ పోయి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాకాయి. దాదాపు 2 నెలలకుపైగా ర్యాలీ కొనసాగగా.. ఒక్కసారిగా అక్టోబర్ నెలలో …

Read More »

పండగ వేళ ఐటీ దిగ్గజం కీలక ప్రకటన.. ఇన్వెస్టర్లకు బోనస్ షేర్ల జారీ.. అదే రోజున ఫలితాలు!

Wipro Q2 Results: ఇన్వెస్టర్లకు అలర్ట్. ఐటీ దిగ్గజ కంపెనీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై- సెప్టెంబర్) ఫలితాల్ని ప్రకటించనుంది. భారత నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన విప్రో లిమిటెడ్.. అక్టోబర్ 17న బోర్డు సమావేశం నిర్వహించి.. ఆర్థిక ఫలితాలకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలపనున్నారు. ఈ క్రమంలోనే బోనస్ షేర్లు జారీ చేయనుంది. త్రైమాసిక ఫలితాల్ని చర్చించి.. ఆమోదించడంతో పాటుగానే.. బోనస్ షేర్ల ప్రతిపాదనపై కూడా బోర్డ్ డైరెక్టర్స్ ఈ నెల 17న జరిగే సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు.. …

Read More »

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలపై ప్రకటన.. వరుసగా పడిపోతున్న అంబానీ స్టాక్.. ఈసారి ఎన్ని వేల కోట్లో?

దేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఎన్నో కంపెనీలు ఉన్నాయి. చాలా సబ్సిడరీలు ఉన్నాయి. ఆయిల్ నుంచి రిటైల్ వరకు టెలికాం నుంచి విద్యుత్ వరకు చాలానే సంస్థలు ఉన్నాయి. ఇక అంబానీ ఎప్పుడో తన సంతానానికి.. పలు విభాగాల బాధ్యతల్ని అప్పగించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రిటైల్ విభాగం అంబానీ తనయ ఇషా అంబానీ చూసుకుంటుండగా.. రిలయన్స్ టెలికాం బాధ్యతల్ని పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ …

Read More »

9 రోజులు వేతనంతో కూడిన సెలవులు.. ఉద్యోగులకు ‘మీషో’ ఆఫర్!

Meesho: ఏ రంగంలో పని చేస్తున్న వారైనా మానసిక, శారీరక ఆరోగ్యానికి కొంత విశ్రాంతి అవసరం. పని ఒత్తిడి నుంచి తమ ఉద్యోగులకు విశ్రాంతి ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరింది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో. తమ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. తమ కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది ఈ సెలవుల్లో పూర్తి విశ్రాంతి తీసుకుని రీఛార్జ్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ …

Read More »

Tata Group: 6 ఖండాలు.. 100 దేశాలు.. 30 కంపెనీలు.. ‘టాటా’ల వారసత్వాన్ని శిఖరాగ్రాలకు చేర్చిన దిగ్గజం!

Tata Group: రతన్ టాటా.. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తల్లో ఒకరు. అయినా ఏ రోజునా సంపన్నులతో కలిసి కనిపించలేదు. టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అత్యంత నిరాడంబరుడు. ప్రపంచ వ్యాప్తంగా 6 ఖండాల్లో 100 దేశాల్లోని టాటా గ్రూప్‌నకు చెందిన 30 కంపెనీలకు రతన్ టాటా నేతృత్వం వహించారు. అయినప్పటికీ అత్యంత అసాధారణ జీవితాన్ని గడిపారు. జేఆర్‌డీ టాటా నుంచి బాధ్యతలు అందుకున్న ఆయన.. టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చారు. కార్పొరేట్ టైటాన్‌గా పేరుగాంచారు. 1937, డిసెంబర్ 28న జన్మించిన …

Read More »

ఆయన మరణం దేశానికి తీరనిలోటు’.. రతన్ టాటాకు పారిశ్రామిక దిగ్గజాల నివాళి!

Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త, బిజినెస్ టైకూన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు దేశీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం టాటా గ్రూప్‌కే కాదు, దేశ ప్రజలకు తీరని లోటన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. రతన్ టాటాతా తనకు ఉన్న అనుబంధం, ఇద్దరూ కలిసి పంచుకున్న అనేక విషయాలు, ఆయన వ్యక్తిత్వం తనలోని స్ఫూర్తిని, తనకు …

Read More »

BSNL వార్షికోత్సవ ఆఫర్.. వారందరికీ ఉచితంగా 24జీబీ డేటా.. ఎలా పొందాలంటే?

Free Data: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో బంపర్ ఆఫర్‌తో వచ్చింది. ఇప్పటికే టారిఫ్ పెంపు పోటీలో ప్రత్యర్థి సంస్థలకు మేకులా తయారైన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఉచితంగా 4జీ డేటా అందిస్తుండడం గమనార్హం. తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తూ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లు, ఆఫర్లను ప్రకటిస్తోందీ. బీఎస్ఎన్ఎల్ సంస్థ ఏర్పాటు చేసి 24 ఏళ్లు పూర్తవుతోంది. కొద్ది రోజుల్లోనే 25వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో తమ కస్టమర్లకు అదిరిపోయే …

Read More »

రైల్వే నుంచి రూ.283 కోట్ల కొత్త ఆర్డర్.. ఫోకస్‌లోకి స్టాక్.. లక్ష పెడితే రూ.20 లక్షలు!

ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి ప్రాజెక్టును తక్కువ బిడ్డింగ్ చేసి దక్కించుకున్నట్లు తెలిపింది. ఒడిశాలో నిర్మాణ పనుల ప్రాజెక్టుగా తెలిపింది. ఈ ఆర్డర్ విలువ రూ. 283.69 కోట్లుగా ఉంటుందని తెలిపింది. రానున్న 24 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించింది. ఈ మేరకు స్టాక్స్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ క్రమంలో ఈ స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. ఇవాళ మార్కెట్ ముగిసిన తర్వాత …

Read More »

భారీగా పెరిగి ఒక్కసారిగా పతనమైన అంబానీ స్టాక్స్.. మళ్లీ లోయర్ సర్క్యూట్.. ఇన్వెస్టర్లకు నష్టం!

Anil Ambani’s Reliance Shares: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి అలర్ట్. దిగ్గజ కంపెనీ స్టాక్స్ ఇవాళ ఒక్కసారిగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ.. రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (ADAG) షేర్లు పడిపోతున్నాయి. ఇటీవల అప్పుల్ని తీర్చేయడం సహా నిధుల సమీకరణ వంటి ఇతర ప్రణాళికల నేపథ్యంలో.. గ్రూప్ స్టాక్స్ అన్నీ వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. రిలయన్స్ పవర్ స్టాక్ ప్రతి రోజూ అప్పర్ సర్క్యూట్ …

Read More »