2008 డీఎస్సీ బాధితులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. యేళ్లుగా నానుతున్న ఈ వ్యవహారం హైకోర్టు జ్యోక్యంతో గాడినపడింది. దీంతో మరో వారం రోజుల్లో నాటి డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్ లు ఇచ్చేందుకు సర్కార్ కార్యచరణ రూపొందిస్తుంది. అయితే ఈ సారైనా ప్రభుత్వం మాటమీద నిలబడుతుందో.. లేదో.. అన్నది వేచిచూడాల్సిందే..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. గతంలోనే ఈ మేరకు ప్రకటన ఇచ్చనప్పటికీ దానిని రేవంత్ సర్కార్ నిలబెట్టుకోలేదు. దీంతో మరో మారు డీఎస్సీ బాధితులకు న్యాయం చేసేందుకు …
Read More »పదో తరగతి మార్కులతో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్షలేదు
తెలుగు రాష్ట్రాల్లోని పదో తరగతి పాసైన వారికి తపాలా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టుల సంఖ్య, దరఖాస్తు విధానం వంటి ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు..దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి తాజాగా ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీలను …
Read More »20 లక్షల ఉద్యోగాలు తప్పక ఇస్తాం.. ఎన్నికల హామీ నిలబెట్టుకుంటాం: మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మర్చిపోలేదని, వాటిని నెరవేరుస్తుందని ఐటీశాఖమంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర నిరుద్యోగులకు తమ ప్రభుత్వం 20లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్టు ఏపీ ఐటీశాఖమంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ఆయన …
Read More »టెట్ అభ్యర్ధులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ
టెట్ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది..రైల్వే శాఖలోని ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6, 2025వ తేదీతో ముగుస్తుందన్న సంగతి తెలిసిందే. …
Read More »రైల్వేలో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో RPF కానిస్టేబుల్ పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. గతేడాది ప్రారంభంలో నోటిఫికేషన్ ఇచ్చినా .. ఇప్పటి వరకు పరీక్షకు సంబంధించిన అప్ డేట్ లు వెలువడకపోవడంతో అభ్యర్ధులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా పరీక్షల షెడ్యూల్ జారీ చేయడంతో వీరి ఎదురు చూపులకు తెరపడినట్లైంది..దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే రీజియన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ నియామకాలకు …
Read More »వైద్యుల నియామక పోస్టులు భారీగా పెంపు.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది డిసెంబరు 2న వైద్యుల నియామకాల కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అదనంగా మరో 200 పోస్టులను జతచేస్తూ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌లో మొత్తం 97 పోస్టులు ఉన్నాయి. వీటికి అదనంగా 200 పోస్టులు కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 297కు పెంచుతున్నట్లు ప్రకటించింది..తాజాగా జారీచేసిన ప్రకటనలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీహెచ్‌ఎస్)కు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ వైద్యుల పోస్టులు 200 …
Read More »ఆ రంగంలో కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఐదు లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపుదలపై ఆయా రాష్ట్రాలు దృష్టి సారించాలని కిషన్ రెడ్డి కోరారు.విద్యుదుత్పత్తిలో బొగ్గు వినియోగం దాదాపుగా తగ్గినా, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడం వల్ల బొగ్గు రంగం రాబోయే కొన్నేళ్లలో ఐదు లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఈ …
Read More »ఎలాంటి రాత పరీక్షలేకుండా ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ. లక్ష వరకు జీతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నెలకు రూ.లక్ష వరకు జీతం అందివచ్చే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 23. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. ఆధ్వర్యంలో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ …
Read More »ఫార్మా జీసీసీలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. వచ్చే ఐదేళ్లలో 25లక్షల ఉద్యోగావకాశాలు
హైదరాబాద్ ఐటీ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణలో ఉన్నతస్థానాన్ని దక్కించుకున్నట్లే, ఇప్పుడు ఫార్మా రంగంలోనూ అగ్రగామిగా ఎదుగుతోంది. బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీలు) తమ వ్యాపార విస్తరణకు, సమర్థవంతమైన నిర్వహణకు ఈ కేంద్రాలను స్థాపిస్తున్నాయి. ఇటీవల, హైదరాబాద్ ఫార్మా జీసీసీలకు కీలక హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఎలీ లిల్లీ, మెర్క్ సంస్థల జీసీసీలు ప్రారంభం 700 బిలియన్ డాలర్ల విలువైన లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో ప్రముఖ సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌ను తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కోసం ఎంచుకుంది. మెర్క్ (ఎంఎస్), …
Read More »టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 3 రాత పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ నుంచి కీ డైన్ లోడ్ చేసుకోవచ్చు. ఆనర్స్ కీపై అభ్యంతరాలు లేవనెత్తే వారు జనవరి 12, 2025 సాయంత్రం 5:00 గంటలలోపు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అభ్యంతరాలు ఇంగ్లీషులో మాత్రమే తెల్పవల్సి ఉంటుంది. అలాగే అభ్యర్ధి పేరు, ఎడిషన్, పేజీ నంబర్ వంటి రిఫరెన్స్ వివరాలను స్పష్టంగా పేర్కొనవల్సి ఉంటుంది.ఎన్నో రోజుల ఎదురు చూపుల తర్వాత …
Read More »