Sports

Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఫిక్స్..! ఫ్రాంఛైజీల రిటెన్షన్ డెడ్‌లైన్ అదే.. రూల్స్‌పై ఉత్కంఠ!

భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి కూడా క్రికెట్ అభిమానులకు.. ఐపీఎల్‌పై అత్యంత ఆసక్తి ఉంటుంది. దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌.. ఇటు బీసీసీఐకి.. అటు ఆటగాళ్లపై కాసులు కురిపిస్తుందని చెప్పొచ్చు. రాత్రికి రాత్రే ఆటగాళ్ల దశ మార్చగల సత్తా ఐపీఎల్‌కు ఉంది. ఫ్రాంఛైజీలు ఆయా ఆటగాళ్లను దక్కించుకునేందుకు నిర్వహించే వేలం ఇంకా ఉత్కంఠకరంగా సాగుతుంది. గత సీజన్‌కు ముందు నిర్వహించిన మినీ వేలంలోనే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ అత్యధికంగా వరుసగా …

Read More »

పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌లో లుకలుకలు.. కోర్టుకెక్కిన రచ్చ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ లీగ్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాటిని సొంతం చేసుకునేందుకు ఎంతో మంది దిగ్గజ వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటారు. ఇటీవల బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిన నేపథ్యంలో ఫ్రాంఛైజీల కోసం పోటీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి లీగ్‌లో భాగమైన పంజాబ్ కింగ్స్ ప్రాంఛైజీలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ జట్టు యజమానుల మధ్య వాటాల విక్రయం విషయంలో వివాదం మొదలైనట్లు సమాచారం. పంజాబ్ …

Read More »

నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్‌.. చరిత్రలో నిలిచిపోనున్న ప్రారంభ వేడుకలు..!

ప్రపంచ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ దేశాల్ని ఒక్కచోటకు చేర్చి ఆటలాడించే అద్భుత ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. నేడు పారిస్‌ వేదికగా ఒలింపింక్స్‌ 2024కు తెరలేవనుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడల్లో నేటి నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. చివరగా పారిస్‌లో 1924లో ఒలింపిక్స్‌ జరిగాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అక్కడ పోటీలు జరగనున్నాయి. ఒలింపిక్స్‌ చరిత్రలో నిలిచిపోనున్న వేడుకలు.. సాధారణంగా ఎప్పుడైనా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు ఆతిథ్య నగరంలోని ప్రధాన స్టేడియంలో జరుగుతాయి. …

Read More »

హార్దిక్‌కు మరోషాక్..!

టీ20 ప్రపంచకప్ 2024లో ఛాంపియన్‌గా నిలివడం మినహా.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గత ఏడాది కాలంగా ఏదీ కలిసి రావడం లేదు. ఆట పరంగా, వ్యక్తిగతంగా అతడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాక.. హార్దిక్ పాండ్యా ఫేట్ మారిపోయింది. తొలి సీజన్‌లోనే గుజరాత్ ఛాంపియన్‌గా నిలవడం.. రెండో సీజన్‌లోనూ ఫైనల్ చేరడంతో పాండ్యా కెప్టెన్సీపై ప్రశంసలు వచ్చాయి. భారత జట్టుకు సైతం భవిష్యత్ కెప్టెన్ అతడే అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఐపీఎల్ …

Read More »

భారత క్రికెట్‌ చరిత్రలో.. తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్‌ అరుదైన ఘనత

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) యూఎస్‌ఏపై భారత యువ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దాంతోపాటు మరో రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అశ్విన్‌ (4/11) రికార్డును అర్ష్‌దీప్ అధిగమించాడు. పొట్టి కప్‌లో తొలి బంతికే వికెట్‌ …

Read More »