కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసిన వేసింది హైకోర్టు.
— హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ కీలక వాదనలు వినిపించారు. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నామన్న ఏజీ.. కమిషన్‌తో సంబంధం లేకుండా సీబీఐ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 7కి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత పూర్తి వాదనలు వింటామన్న హైకోర్టు స్పష్టం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగానే సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానించింది. దీనిపై విచారించిన కోర్టు.. కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకోవద్దని తెలిపింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ఉండదని న్యాయవాదులు తెలిపారు. సీబీఐ దర్యాప్తునకు ఇప్పుడు స్కోప్ లేదని కేసీఆర్, హరీష్‌రావు తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే, కేవలం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పిందే కాని.. అసలు సీబీఐ దర్యాప్తు వద్దని చెప్పాలేదంటున్నారు ప్రభుత్వ న్యాయవాదులు. హైకోర్టు ఆదేశాలను తప్పుగా అర్ధం చేసుకోవద్దంటున్నారు.
కాళేశ్వరం కేసు విచారణకు సీబీఐకి లైన్ క్లియర్!
మరోవైపు కాళేశ్వరం కేసు విచారణకు సీబీఐకి లైన్ క్లియర్ అయ్మింది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకతవకలపై సీబీఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీబీఐకి రాష్ట్రంలోఎంట్రీ లేకుండా 2022 ఆగస్ట్ 30నాటి ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తున్నట్లు జీవో విడుదల చేసింది. కాళేశ్వరం కేసు వరకు సీబీఐకి సడలింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్. సెక్షన్ 6 క్లాస్ 2 పోలీస్ యాక్ట్ నోటిపై చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సీబీఐ విచారణ ను రాష్ట్రంలోకి అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.
Telangana Go