ఉద్యోగుల శిక్షణకు స్వదేశీ ఫ్రేమ్‌వర్క్‌.. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా..

ఫ్రేమ్‌వర్క్‌లోని అంశాలపై కమిషన్ ఎలా నిర్ణయం తీసుకుందనే దానిపై బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘భారతదేశ భవిష్యత్తును నిర్దేశించడానికి ప్రధాని మోదీ చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నాము. ప్రధాని మోదీ చెప్పిన వికాస్‌, గర్వ, కర్తవ్య, ఐక్యత అనే నాలుగు సందేశాలను గుర్తించాము. ఈ నాలుగు తీర్మానాలను సాధించడానికి, ప్రభుత్వ అధికారులు…

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి భారతదేశంలో నైపుణ్యాభివృద్ధికి స్వదేశీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. 2047 నాటికి విక్షిత్‌ భారత్‌ అనే మోదీ గారి లక్ష్యానికి అనుగుణంగా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. ఆధునిక బ్యూరోక్రసీకి శిక్షణ ఇవ్వడానికి 2021లో ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌ ద్వారా దీనిని డెవలప్‌ చేశారు. కర్మయోగి కాంపిటెన్సీ ఫ్రేమ్‌ వర్క్‌ పేరుతో రూపొందించిన ఈ కోర్సు.. ముస్సూరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌తో సహా ప్రభుత్వ శిక్షణా అకాడమీలలో కోర్సులు, వర్క్‌షాప్‌లకు పునాదిగా ఉపయోగిస్తున్నారు.

ఈ ఫ్రేమ్‌వర్క్‌లో అంశాలను భగవద్గీతలోని అంశాల ఆధారంగా పేర్కొన్నారు. సహకారం, స్వాధ్యాయ, రాజ్య కర్మ, స్వధర్మం అనే నాలుగు ప్రధాన ధర్మాలను పెంపొందించడానికి ఈ ఫ్రేమ్‌ వర్క్‌లో అంశాలను ప్రస్తావించారు. 3.2 మిలియన్ల మంది పౌర సేవలకు శిక్షణిచ్చేందుకు ఈ మొట్టమొదటి మేడ్ ఇన్‌ ఇండియా మాడ్యుల్‌ను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుకు శిక్షణ ఇచ్చేందుకు ఈ మాడ్యుల్‌ను రూపొందించారు. ఈ విషయమై కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌లోని హెచ్‌ఆర్‌ సభ్యుడు ఆర్‌ బాలసుబ్రహ్మణ్యం పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బ్యూరోక్రసి శిక్షణా ఫ్రేమ్‌వర్క్‌ విషయంలో ఇప్పటి వరకు పశ్చిమ దేశాలను అనుకరిస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు స్వంత ఫ్రేమ్‌ వర్క్‌ను ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఫ్రేమ్‌ వర్క్‌ భారతీయ నాలెడ్జ్ సిస్టమ్‌, భగవద్గీత సూత్రాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ ఫ్రేమ్‌ వర్క్‌ను డెవలప్‌ చేయడానికి 18 నెలలకు పైగా సమయం తీసుకున్నామని బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ ఫ్రేమ్‌ వర్క్‌ దాదాపు 60 మంత్రిత్వ శాఖలు, 93 విభాగాలతో పాటు వాటి కింద 2,600 పైగా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అవసరాలను తీర్చాలని భావిస్తోంది. కమిషన్ ప్రతి ఉద్యోగి వారి సంబంధిత పని విభాగాలలోని పాత్రలను మ్యాప్ చేసిందని, ఆశించిన ఫలితాలను సాధించడానికి అవసరమైన నిర్దిష్ట సామర్థ్యాలను గుర్తించిందని డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

ఫ్రేమ్‌వర్క్‌లోని అంశాలపై కమిషన్ ఎలా నిర్ణయం తీసుకుందనే దానిపై బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘భారతదేశ భవిష్యత్తును నిర్దేశించడానికి ప్రధాని మోదీ చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నాము. ప్రధాని మోదీ చెప్పిన వికాస్‌, గర్వ, కర్తవ్య, ఐక్యత అనే నాలుగు సందేశాలను గుర్తించాము. ఈ నాలుగు తీర్మానాలను సాధించడానికి, ప్రభుత్వ అధికారులు నాలుగు పునాది విలువలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మా పరిశోధనలో తేలింది. వీటికి అనుగుణంగా ఫ్రేమ్‌ వర్క్‌ను డిజైన్‌ చేశామని’ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఫ్రేమ్‌వర్క్‌ అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భౌతికంగా శిక్షణను అందించడానికి వార్షిక జాతీయ అభ్యాస వారోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఈవారం మొదటి ఎడిషన్‌ ముగిసింది. ఇందులో కేంద్ర, రాష్ట్రాలల నుంచి 4.8 మిలియన్ల మంది పౌర సేవకులను ఆకర్షించింది. 43 శాతం మంది కనీసం నాలుగు కోర్సులను పూర్తి చేసారు.

About Kadam

Check Also

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *