నిత్యం మన జీవితంలో రకరకాల వ్యక్తులు తారసపడుతుంటారు. కానీ వీరిలో కొందరితోనే మనం కనెక్ట్ అవుతాం. మరికొందరిని దూరం నుంచే చూసి తప్పుకుంటారు. ఇంకొందరుంటారు.. ఇలాంటి వారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పొరబాటున ఫ్రెండ్ షిప్ చేశారో బతుకు బస్టాండే..
ధన సముపార్జన ద్వారా ఏ మనిషీ జ్ఞాని కాలేడు. కొందరైతే ఉన్నత పదవుల్లో ఉండి చాలా సంపాదిస్తారు.. కానీ ఎప్పుడూ తెలివితక్కువ పనులు చేస్తుంటారు. ఈ కారణంగా వీరిని ఎల్లప్పుడూ మూర్ఖులుగా పరిగణించబడతారు. కాబట్టి మన చుట్టూ ఈ ఐదు గుణాలున్న వ్యక్తులు ఉంటే వారు మూర్ఖులే. సమాజం కూడా వారిని మూర్ఖులుగా భావిస్తుంది.
స్వయం ప్రకటిత స్మార్ట్ పీపుల్
మీరు స్మార్ట్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న కొంతమందిని చూసే ఉంటారు. కానీ సరిగ్గా అలాంటి వ్యక్తులే నిజంగా మూర్ఖులు. ఇలాంటి వారు ఎవరి మాటలు, సూచనలు వినేందుకు సిద్ధంగా ఉండరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వారి సలహాలు తీసుకోకండి. మీరు అతనికి ఒక సలహా ఇచ్చినా, ఇతరులను దూషించే స్వభావం కలిగి ఉంటాడు. కాబట్టి ఈ వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.
ఇతరులను అవమానించే వ్యక్తులు
చిన్న చిన్న విషయాలకు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను పదేపదే అవమానించే వారు నిజమైన మూర్ఖులు. ఇలాంటి వారితో ఉండడం మంచిది కాదు. దీని వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ. వీరికి ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలియదు. కాబట్టి మీ చుట్టూ ఇలాంటి గుణం ఉన్నవారు ఉంటే వారికి దూరంగా ఉండటమే మంచిది అంటాడు చాణక్యుడు.
స్వీయ స్తుతులు
అందరి ముందు తమను తాము పొగిడే వ్యక్తులు. అలాంటి వారిని కూడా చాణక్యుడు మూర్ఖులు అంటారు. ఈ వ్యక్తులు ఎదుటివారి గురించి గొప్పగా మాట్లాడరు. ఎదుటి వ్యక్తి సరైనదని భావించి చెప్పే విషయాలు వినే ఓపిక వీరికి ఉండదు.
ఆలోచించకుండా పని చేసే వ్యక్తులు
మీరు చూసి ఉండవచ్చు.. కొంతమంది వారు ఏమి చేస్తున్నారో క్షణం కూడా ఆలోచించరు. ఇలా విచక్షణారహితంగా ప్రవర్తించే వ్యక్తులు నిజంగా మూర్ఖులు. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇలాంటి వారితో సహవాసం చేయడం సరికాదు. ఇలా చేస్తే వారి నష్టంలో మనం కూడా పాలుపంచుకోవాల్సి వస్తుంది.
అనవసరమైన సలహాలు ఇచ్చే వ్యక్తులు
కొందరు వ్యక్తులు తమ సన్నిహితులకు లేదా చుట్టుపక్కల వారికి ఎల్లప్పుడూ సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలాంటి వారు కూడా తరచూ మన చుట్టూ తారసపడుతూనే ఉంటారు. అయితే ఇలాంటి వ్యక్తులు తమ తెలివితేటలను ప్రదర్శించేందుకు అనుసరించే మార్గం ఇదని అనుకుంటారు. కానీ వారికి అసలు జ్ఞానమే లేదు. అలాంటి వారి సూచనలు పాటిస్తే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఆచార్య చాణక్యుడు ఇలాంటి వారికి దూరంగా ఉండాలని సూచిస్తున్నాడు చాణిక్యుడు.