మనసంతా విశాఖపైనే.. చంద్రబాబు సర్కార్ ఫుల్ పోకస్.. మూడు దశల్లో రూ.84,700 కోట్లు..

స్టీల్ సిటీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఓ వైపు అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇంకోవైపు మనసంతా విశాఖే అని చాటుకుంటోంది. ప్రకృతి సోయగాలకు నిలయమైన సుందర నగరాన్ని.. అన్ని రంగాల్లో దూసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది.

మొన్న టీసీఎస్‌.. నిన్న గూగుల్‌తో ఎంవోయూ.. ఇంకోవైపు పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు. హెచ్‌పీసీఎల్‌, ఎన్టీపీసీ హైడ్రో పవర్‌ లాంటి వాటిలో లక్షల కోట్ల పెట్టుబడులు. వీటితో పాటు టూరిజం, ఫార్మా అన్ని రకాలుగా విశాఖకు పెద్దపీట వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. స్టీల్ సిటీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఓ వైపు అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇంకోవైపు మనసంతా విశాఖే అని చాటుకుంటోంది. ప్రకృతి సోయగాలకు నిలయమైన సుందర నగరాన్ని.. అన్ని రంగాల్లో దూసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది.

మూడు దశల్లో రాబోతున్న ప్రాజెక్ట్‌కి రూ.84,700కోట్లు..

NTPC, AP GENCOల ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం కాబోతుంది. మూడు దశల్లో రాబోతున్న ప్రాజెక్ట్‌కు 84,700 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి దొరకనుంది. గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామంటోన్న ప్రభుత్వం.. ఉత్పత్తి వ్యయం తగ్గించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కాన్సెప్ట్‌లో సోలార్ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయబోతుంది. ఈ మధ్యే రిలయన్స్ గ్రూప్‌, ఏపీ ప్రభుత్వంతో MOU కుదుర్చుకుంది. రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పించేలా 65 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది.

జపాన్ కంపెనీ నిప్పన్‌ స్టీల్స్‌ జాయింట్‌ వెంచర్‌

కొద్దిరోజుల క్రితం ఉమ్మడి విశాఖకు మిట్టల్ గ్రూప్ తీపికబురు అందించింది. దేశీయ ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిట్టల్‌.. జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్స్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ రెండు దశల్లో పెట్టుబడులు పెట్టాలని డిసైడ్ అయింది. మొదటి దశలో 70 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్ర చరిత్రలోనే ఇది భారీ ఇన్వెస్ట్‌మెంట్‌. అనకాపల్లి సమీపంలోని నక్కపల్లి రాజయ్యపేట దగ్గర ఐఎస్‌పీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి ఆ సంస్థ ప్రతిపాదన పంపించింది.

గూగుల్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం

మరోవైపు టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో డల్లాస్‌ టెక్నాలజీ సెంటర్‌గా ఉన్న ఎల్‌ఎల్‌పీ ప్రాంగణాన్ని క్యాంపస్‌కి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లేటెస్ట్‌గా గూగుల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందన్నారు. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యిందని.. గూగుల్‌ ఎంవోయూతో అభివృద్ధి జరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వానికి విశాఖ హై ప్రయార్టిగా మారిపోయింది. టెక్‌ హబ్‌గా మార్చేందుకు దిగ్గజ కంపెనీలకు రెడ్‌కార్పెట్ పరుస్తూనే.. పారిశ్రామిక, ఫార్మా, టూరిజంపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో సాగర నగరానికి కొత్త వెలుగులు అద్దేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఫైనల్‌గా విశాఖ చుట్టూ అభివృద్ధి.. రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

About Kadam

Check Also

గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా.!

సాధారణంగా మనకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే.. అది గూగుల్ తల్లినో, లేక మరెవరినైనా అడిగి తెలుసుకుంటాం. అయితే గూగుల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *