తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ (ఎక్స్)లో చిరంజీవి ఒక పోస్ట్ షేర్ చేశారు. మెగాస్టార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగులు జరగడం లేదు. తమ వేతనాలు 30% వరకు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళనక దిగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయంపై ఇటు కార్మికులు, నిర్మాతల మధ్య కొన్ని మాటల తూటాలు పేలాయి. అయితే గత 17 రోజులుగా జరుగుతున్న ఈ సమస్యకు గురువారం (ఆగస్టు 21) రాతరి శుభం కార్డు పడిపోయింది. శుక్రవారం నుంచి యథావిధిగా షూటింగ్స్ జరగనున్నాయి. కాగా రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి వద్దకు ఈ పంచాయత వెళ్లింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి సమస్యను పరష్కరించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు సీఎం రేంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
‘ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా, ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు తీసుకొంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్ ను దేశానికే కాదు, ప్రపంచ చలన చిత్ర రంగానికే ఓ హబ్ గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవి. తెలుగు చిత్రసీమ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలని, ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Amaravati News Navyandhra First Digital News Portal