విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి స్కూళ్లకు క్రిస్మస్‌ సెలవులు! మొత్తం ఎన్ని రోజులంటే

తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్‌ విద్యార్థులకు నేటి నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా సెలవులు ఇస్తూ ఇప్పటికే రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ప్రకటనలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం నుంచే స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు.

మిగతా స్కూళ్లలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలుగా ప్రకటించారు. దీంతో డిసెంబర్‌ 25, 26 తేదీల్లో పబ్లిక్ హాలీడేస్‌గా ప్రకటించారు. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ పండుగ కాగా.. డిసెంబర్‌ 26న బాక్సింగ్‌ డే కావడంతో ఈ రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలతోపాటు బ్యాంకులు ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ఇచ్చారు. ఏపీలో రేపు పబ్లిక్ హాలీడే ఉండగా 26న ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి డిసెంబర్‌ 27వ తేదీన బడులు, కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి.

కిస్మస్‌ సెలవుల తర్వాత జనవరి నెలలో మళ్లీ వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈనెలలో మొత్తం 31రోజులు ఉండగా.. అందులో 9 రోజులు సెలవులు వస్తున్నాయి. పాఠశాలలు, కాలేజీలకు ఈ 9 రోజులు సెలవులు ఉండనున్నాయి. జనవరి 2025లో కేవలం 22 రోజులు మాత్రమే పాఠశాలలు, కాలేజీలు తెరచి ఉంటాయి. జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ఆదివారం సెలవులు ఉన్నాయి. ఇక జనవరి నెల సంక్రాంతి పండగ సందర్భంగా సంక్రాంతి సెలవులు కూడా రానున్నాయి. ఆదివారం (జనవరి 12) నుంచి కనుమ వరకు స్కూళ్లకు సెలవులు రానున్నాయి.

About Kadam

Check Also

రానున్న 24 గంటల్లో కుండపోత వాన.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *