ఆరు ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ లవంగాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా లవంగం నీటిని తాగడం వల్ల చిన్న పిల్లలలో సాధారణంగా కనిపించే కడుపు నొప్పులు, రాత్రిపూట గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది..
లవంగాలు ప్రతి ఇంటి వంటగదిలో ఉంటాయి. దీని సువాసన ఆహార రుచిని రెట్టింపు చేస్తాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అంతే కాకుండా లవంగం నీటిలో వివిధ ఆరోగ్య సమస్యలను తొలగించే శక్తి కూడా ఉంది. అందుకే దీనిని ఇంటి నివారణగా ఉపయోగిస్తారు. దీన్ని రోజూ ఈ నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా రాత్రిళ్లు పడుకునే ముందు లవంగం నీటిని తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
జీర్ణక్రియకు మేలు
సాధారణంగా ఆరు ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ లవంగాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా లవంగం నీటిని తాగడం వల్ల చిన్న పిల్లలలో సాధారణంగా కనిపించే కడుపు నొప్పులు, రాత్రిపూట గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటే, వారికి లవంగం నీళ్ళు తాగించడం మంచి పరిష్కారం. జర్నల్ ఆఫ్ ఫార్మకాగ్నోసీ అండ్ ఫైటోకెమిస్ట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. లవంగాలు కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో ఉపయోగపడతాయి. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెంపు
రోగనిరోధక శక్తి బలహీనపడిన వారిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి రోజూ లవంగం నీటిని తాగవచ్చు. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన సూక్ష్మజీవులను నిరోధించే సామర్థ్యాన్ని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి లవంగం నీరు పనిచేస్తుందని వైద్యులు సైతం అంటున్నారు.
ఒత్తిడిని తగ్గిస్తుంది
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం.. లవంగాలలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. పడుకునే ముందు లవంగం నీరు తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.మంచి నిద్ర వస్తుంది. ఈ నీటిని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది.
నోటి ఆరోగ్యానికి మంచిది
లవంగాలలో యూజినాల్ ఉండటం వల్ల, అవి నోటి ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. యూజీనాల్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నోటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. పడుకునే ముందు దీన్ని తీసుకోవడం వల్ల నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చెడు వాసనను నివారించవచ్చు.
కాలేయ ఆరోగ్యానికి చాలా మేలు
లవంగం నీరు తాగడం వల్ల కాలేయం నిర్విషీకరణ అవుతుంది. NIH అధ్యయనం ప్రకారం లవంగాలలోని యూజినాల్ కాలేయాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే ఇది వాపు, ఆక్సీకరణ ఒత్తిడి వంటి మొదలైన కాలేయ రుగ్మతలను తగ్గించడంలో సహాయపడుతుంది.