కొత్త కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌.. కీలక సూచనలు జారీ!

రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 12 మంది కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు చంద్రబాబు. తన దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని.. అధికారులు కూడా అలాగే పని చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల ఎంపికలో అతనకున్న బెస్ట్ ఆప్షన్లలో మిమ్మల్ని ఎంపిక చేశానని ఆయన వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు, ఐఎఫ్ఎస్‌లు, ఐపీఎస్ లు బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్తగా కలెక్టర్లుగా నియమితులైన అధికారులో సీఎం చంద్రాబాబు సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు సామాన్యుడిగా ఉన్నట్లే కలెక్టర్లు కూడా ప్రజలతో సామాన్యులు గా ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరైనా ఆరోపణలు చేస్తే వెంటనే స్పందించాలని కలెక్టర్లకు సూచించారు. ఎల్లప్పుడూ రూల్స్‌ అంటూనే కాకుండా మానవీయ కోణంలో కూడా ఆలోచించి అధికారులు పనిచేయాలన్నారు.

ఇదిలా ఉండగా ఈనెల 15, 16 తేదీల్లో మరోసారి సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ లకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రెండు రోజుల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్లకు రూపకల్పన పూర్తి చేశారు. ఈ సమావేశంలో ఏడాదిన్నర పాలన విధివిధానాల అమలు తీరుపై సీఎం సమీక్షించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

ఈసారి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించే ఈ సదస్సులో వచ్చే మూడేళ్లలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలులో వస్తున్న ఫిర్యాదులను క్రోఢీకరించి నూరు శాతం సంతృప్తి స్థాయికి చేరే లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు తెలిసింది. ప్రతి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా ప్రయోజనాలు, జిల్లాల వారీ అవసరాలను గుర్తించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలనే భావనతో సీఎం చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *