చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన ఘోరమైన అమానవీయ ఘటనపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించింది. అప్పు తీర్చలేదని ఒక మహిళను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి దారుణంగా అవమానించిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. స్వయంగా తానే బాధిత మహిళకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి దారుణంగా అవమానించారు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సహా వ్యాప్తంగా అధికారులు స్పందిస్తూ సీరియస్ అయ్యారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని సీఎం అధికారులకు ఆదేశించారు. మరోవైపు బాధిత మహిళకు సీఎం చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు.
బాధితురాలిని పరామర్శించి, దైర్యం చెప్పిన సీఎం..
శిరీషా.. ప్రభుత్వం నీతో ఉంది నువ్వు భయపడవద్దు. ప్రభుత్వం నిన్ను అన్ని విధాలా ఆదుకుంటుంది. నీకు పూర్తిగా అండగా ఉంటాము” అని ముఖ్యమంత్రి శిరీషకు భరోసా ఇచ్చారు. ఇటువంటి అమానవీయ ఘటనలను ప్రభుత్వం ఏ మాత్రమూ సహించదని. ఇప్పటికే సబ్ కలెక్టర్, పోలీసు అధికారులకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించానని సీఎం తెలిపారు.
శిరీష కుటుంబ స్థితిగతులు తెలుసుకున్న సీఎం, ఆమె పిల్లల చదువు గురించి ప్రత్యేకంగా ఆరా తీశారు. “పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందవద్దని. వారి చదువు కోసం ప్రభుత్వం అన్ని బాధ్యతలు తీసుకుంటుందని తెలిపారు. పిల్లలను బాగా చదివించాలని ఆమెకు సలహా ఇచ్చారు. ఆ వెంటనే శిరీషకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే మూగ్గురు పిల్లల చదువుకు కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. అధికారులు ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని, శిరీష కుటుంబానికి అవసరమైన సాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరి మనసులను కలిచివేసింది. బాధితురాలు శిరీషకు సీఎం ఇచ్చిన భరోసా. ఆ కుటుంబానికి ఒక కొత్త వెలుగు చూపించనుంది. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న విశ్వాసం ఈ సంఘటనతో మరింత బలపడింది.