డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం- సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో గంజాయి మాట వినిపిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో డ్రగ్స్‌, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నామని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ ముందుకెళతామని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణను గత ప్రభత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని ఎవరైనా డ్రగ్స్‌తో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గురువారం గుంటూరులో నిర్వహించిన వాకథాన్‌ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్వేశాలను రెచ్చగొడుతూ, గంజాయి బ్యాచ్‌కు అండగా నిలిచే వారికి తగిన గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు. గంజాయి నిర్మూలన అనేది.. కేవలం ప్రభుత్వ బాధ్యతే మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతన అని ఆయన గుర్తుచేశారు. డ్రగ్స్‌ నిర్మూలనలో ప్రతిపక్షాలు కూడా కలిసినడవాలని కోరారు. 2021లో దేశవ్యాప్తంగా పండిన మొత్తం గంజాయిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచే 50 శాంతం ఉత్పత్తి కావడం బాధాకరం అన్నారు.

డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసలై యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మెడికల్ షాపులో కూడా మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అందు కోసమే ‘ఈగల్’ అనే సంస్థను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఎక్కడ డ్రగ్స్‌ మూలాలు కనిపించిన డేగ కన్ను వేసి ఉంచుతుందని తెలిపారు.

రాష్ట్రంలో మళ్లీ ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే వారిపై కఠిన చర్యలతో పాటు వారి అస్తులు కూడా జప్తు చేస్తామని సీఎం హెచ్చరించారు. డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎవరైనా, ఎక్కడైనా డ్రగ్స్‌, గంజాయి ఆనవాళ్లను గుర్తిస్తే 1972కి సమాచారం ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

About Kadam

Check Also

మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..

జులై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. టికెట్ల బుకింగ్‌కు సంబంధించి కూడా కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *