ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి టార్గెట్‌గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్‌.. సీఎం చంద్రబాబు సీరియస్!

వైసీపీ నేతలపై తీరుపై మరోసారి సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టార్గెట్‌గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంత చేసినా వైసీపీ నేతల తీరులో మార్పు రావడం లేదన్నారు. మహిళలను దూషించడం, బూతులు తిట్టడం, కించపరచడం అనేది ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుంది. మహిళలను అవమానపరచడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని చంద్రబాబు విమర్శించారు. వారి ఘోర ఓటమికి ఇలాంటి పోకడలు ఒక కారణమని తెలిసినా వారి సహజ గుణంలో మార్పు రావడం లేదని ఆయన అన్నారు.

చెల్లి పుట్టుకపైనా వ్యాఖ్యలు చేసిన వారి నాయకత్వంలో పనిచేస్తోన్న నేతలు అంతే దారుణంగా, అసహ్యంగా మాట్లాడుతూ వారి నీచ సంస్కృతిని చాటుకుంటున్నారని వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు.మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వీరు మనుషులేనా? ఇది రాజకీయమా? అంటూ ప్రశ్నించారు. మహిళల, మహిళానాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రణాళికాబద్దంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడు గమనించాలని ఆయన అన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠినచర్యలు ఉంటాయి మరోసారి సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *