కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ!

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఆయనతో పలు అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్ర సమస్యలను సీఎం కేంద్రమంత్రికి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపిపారు. అంతే కాకుండా మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రి అమిత్ షా కు, కేంద్రానికి, ప్రధానికి ధన్యవాదాలు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో ముఖ్యమంత్రి చర్చించారు. గత ఏడాది కాలంలో జరిగిన అభివృద్దిని సీఎం చంద్రబాబు అమిత్‌షాకు వివరించారు. ధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థను కేంద్రం అందించిన సహకారంతో గాడిలో పెడుతున్నామని ఆయన కేంద్రమంత్రికి తెలిపారు.

అయితే ఇప్పటికీ ఆర్ధిక వనరుల పరంగా తీవ్రమైన కొరతను ఎదుర్కోంటున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమనే విషయాన్ని సీఎం ప్రత్యేకంగా కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు, ఆభివృద్ది కార్యక్రమాలకు ఆర్ధిక సాయం కోరారు. విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్ధిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలా చూడాల్సిందిగా 16 ఆర్ధిక సంఘానికి నివేదించినట్లు అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించారు.

బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు ప్రస్తావన..

బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు విషయాన్ని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం –బనకచర్ల లింక్ ప్రాజెక్టు (BPLP)ను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకూ 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు వివరించిన సిఎం వివరించారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజుల మిగులు నీరు ఉందని సిఎం కేంద్రమంత్రికి తెలిపారు. చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రికి వివరించారు.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *