సింగపూర్‌లో చంద్రబాబు సభకు కిక్కిరిసిన ఆడిటోరియం… ఐదు దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రజలు..

సింగపూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్‌తో సహా సమీప ఐదు దేశాల్లోని తెలుగువారు, ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. సభా నిర్వహణ కోసం నిర్వహకులు తీసుకున్న వన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం తరలివచ్చిన తెలుగువారితో నిండిపోయింది. ఊహకుమించి వచ్చిన తెలుగువారితో ఆడిటోరియం నిండిపోయింది. దీంతో అనుబంధంగా ఉన్న మరో ఆడిటోరియంలోకి సభికులను నిర్వాహకులు తరలించారు.

తెలుగు ప్రజల ఆనందం, సంతోషాల నడుము సుమారు ఐదు గంటల పాటు పండుగలా డయాస్పోరా కార్యక్రమం సాగింది. 4వ సారి ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తర్వాత తొలిసారి సింగపూర్‌కు సీఎం చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో భార్యాపిల్లలు, స్నేహితులతో కలిసి ఎన్ఆర్ఐలు డయాస్పోరాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి… కార్యక్రమం అనంతరం దాదాపు 2,500 మందితో ఫోటోలు దిగారు. రెండున్నర గంటలపాటు ఓపిగ్గా నిలబడి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబు ఫోటోలు దిగారు. ఫోటో దిగలేదన్న నిరూత్సాహం ఎవ్వరిలో లేకుండా ఉండేలా వేదికపైనే ఉండి ప్రతి కుటుంబం ఫోటోలు దిగేలా మంత్రి నారా లోకేష్ సహకరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుగువారు పంచుకున్నారు. పిల్లలతో సహా తెలుగు సాంప్రదాయంతో డయాస్పోరా కార్యక్రమానికి హాజరైన మహిళలను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

సింగపూర్‌లో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలతో ఐదు గంటల పాటు గడపడం నాలో సంతృప్తిని నింపింది. కష్టపడే తత్వం ఉన్న తెలుగు జాతి ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించి తెలుగునేల ప్రతిష్టను మరింత పెంచుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఆయా దేశాల అభివృద్ధిలో భాగస్వాములవుతూ సేవలందిస్తున్నారు. ఏ దేశంలో చూసినా అందరికంటే తెలుగువారి తలసరి ఆదాయమే ఎక్కువగా ఉండటం గర్వించవలిసిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీరో పావర్టీ-పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని డయాస్పోరా వేదికపై నుంచి నేను కోరగా… దానికి వారంతా సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

About Kadam

Check Also

అనుమానమే పెనుభూతమై.. ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.. కట్‌చేస్తే..

తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో దారణం వెలుగు చూసింది. అనుమానం ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *