ఏపీలో అప్పుడే మొదలైన పందెంరాయుళ్ల హడావిడి

ఏపీలో అప్పుడే పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. సంక్రాంతి పండగకు నెలరోజుల ముందే పందెం రాయుళ్లు కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు. కోళ్లకు కత్తులు కట్టి కొట్లాట పెట్టారు. బరిలో బస్తీ మే సవాల్ అని తొడలు కొడుతున్నారు. పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా పట్టపగలే కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. వేలల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కోళ్ల పందాలపై సమాచారం అందుకున్న గుడివాడ రూరల్ పోలీసులు బరులపై దాడులు చేశారు. పోలీసులను చూసి పందెంరాయుళ్లు పరుగులు పెట్టారు. కోడిపందాల బరుల దగ్గర నలుగురిని అదపులోకి తీసుకున్నారు పోలీసులు. 25 బైక్‌లు, రెండు ఆటోలు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

కోడి పందేలా విషయంలో ప్రతి ఏడాది లాగా కాదు.. ఈ సారి కథ వేరే ఉంటదంటున్నారు పోలీసులు. నిబంధనలు అతిక్రమించి ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి ముసుగులో కోడిపందేలు, గుండాటలు నిర్వహించకుండా చర్యలు చేపడుతున్నారు. యువత కోడిపందేలు, గుండాటల జోలికి వెళ్ల కుండా సంప్రదాయ క్రీడా పోటీలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. కబడ్డీ, వాలీబాల్ లాంటి వాటిపై యువతరం దృష్టి సారించాలన్నారు పోలీసులు.

About Kadam

Check Also

క్లాస్ రూమ్‌లో ఒంటరిగా విద్యార్థిని.. ఆమె వద్దకు వెళ్లి ప్రొఫెసర్ వికృత చేష్టలు

తిరుపతి SV అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *