ఇన్నాళ్లు చలి.. ఇప్పుడు పొగమంచు.. తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను గుర్తించలేని పరిస్థితి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలు చలి తీవ్రతతో గజగజలాడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, కోనసీమ శ్రీకాకుళం జిల్లాల్లో కనీష‌్ణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. పొగమంచు, చలితో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇంకా జనవరి నెలలో ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది.
మరోవైపు దట్టంగా అలముకున్న పొగ మంచు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకంటోంది. తెల్లవారుజామును కురుస్తున్న మంచు తుంపరలను ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు. ఏజెన్సీలో కాశ్మీరును తలపిస్తున్నాయి మంచు కొండలు.
అటు ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది.. జమ్మూకశ్మీర్, హిమాచల్‌లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal