మెగా డీఎస్సీ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది! ఇంతకీ ఎప్పట్నుంచంటే

విద్యాశాఖ మొత్తం 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేయగా 3,36,300 మంది నుంచి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ మెగా డీఎస్సీలో ఏకంగా 49.9% మంది మహిళలు సత్తా చాటారు. అన్నిరకాల పోస్టులకు కలిపి 15,941 మంది ఎంపికయ్యారు. ఇందులో 7,955 మంది మహిళలే ఉండటం..

డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితాను ఇప్పటికే విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మొత్తం 16,347 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా 3,36,300 మంది నుంచి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ మెగా డీఎస్సీలో ఏకంగా 49.9% మంది మహిళలు సత్తా చాటారు. అన్నిరకాల పోస్టులకు కలిపి 15,941 మంది ఎంపికయ్యారు. ఇందులో 7,955 మంది మహిళలే ఉండటం విశేషం. ఇందులో ఆయా రిజర్వేషన్‌ అభ్యర్థులు లేనందున 406 పోస్టులు మిగిలిపోయాయి. మెగా డీఎస్సీని ప్రభుత్వం కేవలం 150 రోజుల్లోనే పూర్తిచేసింది. ప్రాథమిక ‘కీ’పై 40 వేల అభ్యంతరాలురాగా.. అన్నింటినీ పరిశీలించి తుది ‘కీ’ రూపొందించారు.

రాత పరీక్షకు 80 శాతం, టెట్‌కు 20 శాతం వెయిటేజీతో ఫలితాలను వెలువరించింది. మొత్తం 69 కేటగిరీల్లో డీఎస్సీ నిర్వహించగా.. వీటిల్లో 9 కేటగిరీల్లో నార్మలైజేషన్‌ను పాటించారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన 7 విడతల్లో ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 13 వరకు చేపట్టారు. అలాగే క్రీడా కోటా 3% రిజర్వేషన్‌ అమలు చేస్తూ పోస్టులను భర్తీ చేసిన తొలి ప్రక్రియ ఇదే కావడం విశేషం. క్రీడా కోటాలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా 372 మందికి ఉద్యోగాలు వచ్చాయి.

సెప్టెంబర్‌ 22 నుంచి డీఎస్సీ కౌన్సెలింగ్‌..

ఇటీవల విడుదల చేసిన మెగా డీఎస్సీ తుది జాబితాలోని అభ్యర్థుల పోస్టింగ్‌లకు సంబంధించి సెప్టెంబర్‌ 22 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దసరా సెలవుల్లో 22 నుంచి 29 వరకు కొత్తగా ఎంపికైన అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి, కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దసరా సెలవుల అనంతరం వీరంతా తమకు కేటాయించిన బడుల్లో చేరనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌ కూడా ఏర్పాటు చేశారు. ఏవైనా సందేహాలుంటే 8125046997, 9398810958, 7995649286, 7995789286 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఎంపికైన వారందరికీ సెప్టెంబర్‌ 19న అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదగా నియామక పత్రాలను అందజేయనున్నారు.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *