మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు చిరిగినా, కాలిపోయినా ఏం చేస్తాం, వాటిని ప్లాస్టర్‌తో అతికించి చెలామని చేసేలా చూస్తాం. కానీ అక్కడ కూడా చెలామని కాకపోతే ఇక చేసేదేమి లేక పడేయడమో దాచి పెట్టడమో చేస్తుంటాం. మనకు ఎదైనా సమస్య వస్తే చూయించుకోవడానికి హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో.. నోట్లను సరిచేసేందుకు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. కరెన్సీ హాస్పిటల్స్ ఇవెక్కడున్నాయి అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్ వద్ద “నోట్ల హాస్పిటల్” పేరుతో ఈ షాప్ ఉంది. ఈ ప్రాంతంలో గత 55 ఏళ్లుగా ఈ వ్యాపారం నిర్వహించబడుతుంది. ఇక్కడ చిరిగిన, కొంతమేర కాలిపోయిన కరెన్సీ నోట్లను జనాల నుంచి సేకరించి వాటిని బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకోవడం చేస్తుంటారు ఈ షాపు నిర్వాహకులు. ఇక్కడి నోట్ల హాస్పిటల్‌లో మనం ఇచ్చే నోట్లను, అవి పాడైన తీరు, అది ఎతం శాతం చిరిగిందే అనే దాన్ని పరిగణలోకి తీసుకొని మనకు వారు డబ్బును చెల్లిస్తారు. ఎలాగంటే మనం 100 రూపాయలు ఇస్తే ఆ నోటు పాడైన తీరును బట్టి మనకు రూ.40-60 వరకు మంచి నోట్లను తిరిగి ఇస్తారు.
ఇలా మన దగ్గర నుంచి సేకరించిన పాడైన నోట్లను ఇదువరకు ఆర్‌బీఐ శాఖల నుంచి మార్పిడి చేసుకొని ఈ వ్యాపారులు కమీషన్ పొందేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లోని బ్యాంకుల చెస్ట్‌ల ద్వారా మార్పిడి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ షాపులు ఒక్క గుంటూరో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్నట్టు సమాచారం.ఈ నోట్ల హాస్పిటల్ నిర్వాహకు అందించే సేవలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయిని ఇక్కడికి వచ్చే సందర్శకులు చెబుతున్నారు.