రోజుకో కొత్త రకం నేరాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకరకంగా నమ్మించి వారి బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా ఖాళీ చేసేస్తున్నారు. ఈ విషయాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో బాగా చదవుకున్న వారు కూడా సైబర్ నేరగాళ్ల బుట్టలో పడి లక్షలు, కోట్లు కోల్పోతున్నారు. దీనికి సంబంధించి నిత్యం వార్తా కథనాలను మనం చూస్తూనే ఉన్నాం.. ట్రాయ్‌తో పాటు పోలీసులు సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆన్‌లైన్ వేదికగా పలు అవగాహన కార్యక్రమాలను సైతం చేపడుతోంది. మరి ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారం మీ కోసం..
- TRAI మీ ఫోన్ కనెక్టివిటీని నిలిపివేయాలని ఫోన్ చేసారు అంటే, దయచేసి స్పందించకండి. ఇది ఒక స్కామ్.
- FedEx నుండి మీకు ప్యాకేజీ గురించి ఫోన్ చేసి, 1 నొక్కమని అడిగితే, దయచేసి స్పందించకండి. ఇది ఒక స్కామ్.
- పోలీస్ ఆఫీసర్ మీతో మీ ఆధార్ గురించి మాట్లాడితే, దయచేసి స్పందించకండి. ఇది ఒక స్కామ్.
- మీరు ‘డిజిటల్ అరెస్టు’లో ఉన్నారని చెప్పారు అంటే, దయచేసి స్పందించకండి. ఇది ఒక స్కామ్.
- మీ ప్యాకేజీ లేదా మీరు పంపిన ప్యాకేజీ లో మత్తు పదార్ధాలు ఉన్నాయని చెప్పితే, దయచేసి స్పందించకండి. ఇది ఒక స్కామ్.
- మీకు “ఎవరికైనా చెప్పకు” అని చెప్పారు అంటే, వినకండి. సైబర్ క్రైమ్ పోలీసులకు 1930 నెంబర్‌కు సమాచారం ఇవ్వండి.
- వాట్సాప్ లేదా SMS ద్వారా సంప్రదించినా, దయచేసి స్పందించకండి. ఇది ఒక స్కామ్.
- మీ UPI IDకి డబ్బులు పంపినట్లు చెప్పి, వాటిని తిరిగి అడిగితే, దయచేసి స్పందించకండి. ఇది ఒక స్కామ్.
- మీ కారు లేదా సోఫా కొనేందుకు ఆర్మీ లేదా CRPF నుండి ఫోన్ చేసి, వారి ఐడీ కార్డు చూపితే, దయచేసి స్పందించకండి. ఇది ఒక స్కామ్.
- స్విగ్గీ లేదా జొమాటో నుండి ఫోన్ చేసి మీ చిరునామాను కన్ఫర్మ్ చేయమని అడిగితే, దయచేసి స్పందించకండి. ఇది ఒక స్కామ్.
- ఆర్డర్ లేదా రైడ్ రద్దు చేసేందుకు OTP అడిగితే, దయచేసి స్పందించకండి. ఏ సమయంలో అయినా OTP ని ఎవరితోనూ పంచుకోకండి.
- మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఎలాంటి వీడియో కాల్స్ కి జవాబు ఇవ్వకండి.ఇందులో చిక్కుకున్నట్లైతే, మీ ఫోన్ ఆపి ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి.
- పోలీసు, CBI, ED, IT డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన నోటీసులు ఉన్నా, ఆఫ్‌లైన్‌లో ధృవీకరించండి.
- మీకు సమన్స్ అని కోర్ట్ నుంచి పంపించామని చెప్పినప్పుడు, అది నిజమని చెప్తే, కోర్ట్ ప్రాసెస్ సర్వర్ ద్వారా లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపమని అడగండి.
- మీకు పోలీసు స్టేషన్ నుండి ఫోన్ వస్తే, స్థానిక పోలీసు స్టేషన్ వద్ద సర్వ్ చేయమని చెప్పండి.
- మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలను ఎవరితోనూ పంచుకోకండి.
- Truecaller ను ఉపయోగించండి. స్పామ్ లేదా ఫ్రాడ్ అని గుర్తించిన కాల్స్‌ని అవాయిడ్ చేయండి.
- ఎవరైనా అత్యవసర పరిస్థితి లేదా ఇబ్బందులు అని చెప్పి, డబ్బులు పంపమని అడిగితే, దయచేసి వారి కుటుంబ సభ్యులను కాల్ చేసి ధృవీకరించండి. లేకుంటే, మీరు స్వయంగా ఆ స్థలానికి వెళ్ళండి.
- “షేరు/స్టాక్ లేదా క్రిప్టోకరెన్సీ కొనడానికి” ఎవరైనా కాల్ చేయడాన్ని ఎప్పుడూ అంగీకరించకండి.
- వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటూ వచ్చే కాల్స్/సందేశాలకి స్పందించకండి.
- రాత్రి సమయంలో మీరు ఇబ్బందిలో ఉన్నట్లు చెప్పి, బంధువులు లేదా స్నేహితులు సాయం కోరినప్పుడు, ముందుగా కూల్‌గా ఆ పరిస్థితిని అంచనా వేయండి.
- రుణాలు యాప్‌లు మిమ్మల్ని బానిస చేయవచ్చు వారిపట్ల https://cybercrime.gov.in/ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. ఏ కోర్టు, పోలీసు స్టేషన్ లేదా ప్రభుత్వ నిఘా ఏజెన్సీ కాల్ చేసి, నేరుగా మీకు సమాచారం ఇవ్వలేదు. ఇలాంటి వాటి పట్ల కనీస అవగాహన పెంచుకుంటేనే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.