తల్లికి వందనం పడిందా అని అడిగారు.? ఒక్క ఫోన్ కాల్‌తో అంతా పాయే

సమాజంలో రోజు రోజుకు వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా  సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఇప్పటికే విజయవాడ కమీషనరేట్ పరిధిలోని ప్రజలకు పలు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ మొదలగు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు పోలీసులు .. దాంతో ఈ మధ్య  నగరంలో సైబర్ నేరాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

దాంతో  సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య మాలు కొత్త పుంతలు తొక్కుతూ అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి ఫోన్ చేసి మీకు వివిధ పధకాల ద్వారా డబ్బులు పడేలాగా చేస్తాం అని మాయమాటల ద్వారా సైబర్ నేరాలు చేస్తున్నారు… ఈ విధంగా తాజాగా నున్న పోలీసు స్టేషన్ పరిదిలో ఇద్దరు మహిళలకు సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి మీకు తల్లికి వందనం పడలేదా మీ అక్కౌంట్ హోల్డ్ లో ఉంది అని చెప్పి వారి ద్వారా ఫోన్ నుండి పలు దఫాలుగా డబ్బులు వేరొక అక్కౌంట్ కు పంపించుకుని మోసం చేశారు…అప్పటికే ప్రభుత్వ పథకం డబ్బులు కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లులు వారి ఉచ్చులో పడి వారి చెప్పినట్లుగా చేస్తూ వారికి తెలియకుండానే వారి ఖాతా నుండి డబ్బులు వారికి పంపేశారు ఎంతకీ డబ్బులు పడకపోగా ఉన్న డబ్బులు పోగా మోసపోయినట్లు గుర్తించి పోలీసులు ఆశ్రయించారు… దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. సైబర్ నరాల్లో చాలావరకు మోసాలు జరగడమే తప్ప డబ్బులు తిరిగి రావడం చాలా కష్టతరమవుతుందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రభుత్వ పథకాల సమయంలో సైబర్ నెరగాళ్లు వాటిని అడ్డుగా పెట్టుకుని ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారని కాబట్టి వాటి పట్ల కాల్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు… ప్రజలు చాలా అప్రమత్తంగా అనవసరంగా తెలియని వ్యక్తులకు ఫోన్ స్క్రీన్ షేరింగ్ చేయడం గాని,  బ్యాంక్ వివరాలను గాని, ఓ.టి.పి.లను గాని చెప్పరాదని, వివిధ పధకాలకు డబ్బులు పడేలాగా చేస్తామని చెప్పి మీ అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు నేరాలు చేస్తారని ప్రజలు ఇటువంటి నేరాలపై అవగాహన కలిగి ఉండి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.

About Kadam

Check Also

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *