ఎమ్మెల్యేకు తప్పని న్యూడ్ కాల్ బెదిరింపులు.. సైబర్ నేరగాళ్లతో వీరేశం పరేషాన్!

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల అమాయకులనే కాదు ప్రజా ప్రతినిధులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేపై అశ్లీల వీడియో కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేశారు.

నల్లగొండ జిల్లా నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సెల్‌ఫోన్‌లోకి చొరబడి సైబర్ ఎటాక్ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్‌లో నుండి ఫోటోలను సేకరించిన సైబర్ క్రిమినల్స్.. స్క్రీన్ రికార్డు పర్సనల్ నెంబర్ వాట్సాప్ కి పంపి ఎమ్మెల్యేను బెదిరించారు. చివరికి తనపై జరుగుతున్న సైబర్ ఎటాక్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరులతో మాట్లాడుతున్న సమయంలోనే సైబర్ నేరగాళ్ల నుంచి వీడియో కాల్ వచ్చింది. ఒక్కసారిగా నగ్నంగా ఉన్న వ్యక్తి వీడియో కాల్‌లోకి రావడంతో కాల్ కట్ చేశారు వీరేశం. వీడియో కాల్ సైబర్ మోసగాళ్లు చేస్తున్నారని వెంటనే పసిగట్టిన వీరేశం.. వెంటనే కాల్ కట్ చేశారు. అంతటితో వదలని కేటుగాళ్లు వాట్సాప్ చాటింగ్ ద్వారా మెసేజ్‌లు పంపి ఎమ్మెల్యేను బెదిరించారు సైబర్ నేరగాళ్లు. వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా లేదంటే డబ్బులు పంపిస్తావా అంటూ బ్లాక్ మెయిల్ చేశారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే వీరేశం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సలహాతో సైబర్ నేరగాళ్ల నెంబర్ ను ఎమ్మెల్యే వీరేశం బ్లాక్ చేశారు.

సైబర్ నేరాలు పట్ల అప్రమత్తత అవసరం..

గత ఏడాది అక్టోబర్ లో సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యే వీరేశం పేరుతో డబ్బులు కావాలంటూ ఆయన సన్నిహితులకు వాట్సాప్ మెసేజ్‌లు చేశారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజలను కోరారు. సైబర్ నేరాలు పట్ల అవగాహన కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్ రింగ్ టోన్ ను పెట్టారని ఆయన చెప్పారు. సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫైబర్ నేరగాళ్ల విషయంలో ఆన్‌లైన్ గేమింగ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేముల వీరేశం సూచించారు.

About Kadam

Check Also

తీగలాగితే డొంక కదులుతోంది.. ఇకపై ఆటలు సాగవంటున్న సైబర్ పోలీసులు!

సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *