ఆర్టీవో చలాన్ కట్టాలంటూ వాట్సప్‌కు మెస్సెజ్.. క్లిక్ చేస్తే ఊహించని సీన్.. బీ అలర్ట్..

మోసం.. మోసం.. మోసం.. మనకు తెలియకుండానే మన ఫోన్ ద్వారా ఇట్టే దోచేస్తున్నారు సైబర్ బూచోళ్లు.. అందుకే.. ఫోన్ చేసినా.. మెస్సెజ్ చేసినా.. ఏ లింకులను క్లిక్ చేయొద్దు.. ఎవర్నీ నమ్మోద్దు.. అంటూ పోలీసులు అందరికీ సూచిస్తున్నారు. అయినా.. కొందరు పట్టించుకోకుండా కొందరు సైబర్ క్రిమినల్స్ మోసం బారిన పడి లబోదిబోమంటున్నారు బాధితులు.. తాజాగా.. హైదరాబాద్ నగరంలో.. మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.. ఆర్టీఓ చలాన్ కట్టలంటూ వాట్సప్ ద్వారా వచ్చిన మెస్సెజ్‌లను క్లిక్ చేసిన ఇద్దరు హైదరాబాద్ నివాసితులు దాదాపు 6 లక్షలు పోగుట్టుకున్నారు. వాట్సాప్ ద్వారా పంపిన నకిలీ RTO చలాన్ APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు దాదాపు రూ.6 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఒక వ్యక్తి వాట్సప్ నుంచి ‘RTO చలాన్’ అనే APK ఫైల్‌ను అందుకున్నాడు.. దానిని అతను పొరపాటున తెరిచాడు. తరువాత అతని రెండు ఖాతాల నుండి రూ.1,01,226 మొత్తం డెబిట్ అయ్యాయి. దీంతో అతను పోలీసులను సంప్రదించాడు.

మరొక కేసులో కూడా ఇలానే జరిగింది.. మరో వ్యక్తి  ” RTA చలాన్ 140.apk” అనే APK ఫైల్ ను అందుకున్న తర్వాత ఆ యాప్ ను తన ఫోన్‌ లో డౌన్‌లోడ్ చేసుకున్నాడు.. వెంటనే సైబర్ మోసగాళ్లు.. అతని బ్యాంకు ఖాతాలో నుంచి రూ.5 లక్షలు కాజేశారు.. అని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

తెలియని మొబైల్ నంబర్ల ద్వారా పంపిన ఏ లింక్‌లపై క్లిక్ చేయవద్దని లేదా APK ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని లేదా ఇన్‌స్టాల్ చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్థిక మోసాలను నివారించడానికి తెలియని నంబర్ల నుండి వచ్చిన ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయవద్దని.. ఇటువంటి యాప్‌లు రహస్యంగా బ్యాంకింగ్ వివరాలను దొంగిలిస్తాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

“ఒకసారి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఈ ఫైల్‌లు బాధితుడి మొబైల్ ఫోన్, బ్యాంకింగ్ వివరాలను రహస్యంగా యాక్సెస్ చేస్తాయి.. దీని వలన అనధికార లావాదేవీలు.. భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది” అని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరించారు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *