పెన్షన్ ఇస్తామని నమ్మించారు.. చివరికి వృద్ధులను ఇలా చేశారు..!

అన్‌నోన్‌ కాల్‌ ఎత్తారో అడ్డంగా బుక్కైపోతారు. అవతలివారి మాటలు నమ్మారో నిండా మునిగిపోతారు. మాటలతో బెదిరిస్తారు సైబర్‌ బూచోళ్లు. ఎకౌంట్లో క్యాష్‌ పడేదాకా టార్చర్‌ పెడతారు. చదువుకున్నోళ్లు, ఉద్యోగులు కూడా మోసగాళ్ల బారినపడుతున్నారు. కొత్త టెక్నిక్స్‌తో జనాన్ని ట్రాప్‌ చేస్తున్నారు.. మోసాల్లో ముదిరిపోయిన సైబర్‌ క్రిమినల్స్‌.

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త నేరంతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. తాజాగా వృద్ధులకు వచ్చే పెన్షన్లను సైతం కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్‌గా చాలామంది వృద్ధులు అనవసర లింకులను క్లిక్ చేసి తమ ఖాతాల్లోని డబ్బులు పోగొట్టుకున్నారు. పెన్షన్ ఇస్తామని వచ్చే ఎస్ఎంఎస్‌ను నమ్మవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెన్షన్ పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేసి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి మొదలుకొని కేంద్ర ప్రభుత్వం వరకు అందించే సంక్షేమ పథకాలను సైతం సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధిదారులకు డబ్బు వచ్చి తమ బ్యాంక్ అకౌంట్లో చేరుతున్న విషయాన్ని సైబర్ నేరస్తులు పసిగట్టారు. దీంతో వెల్ఫేర్ స్కీమ్స్ తోనే సైబర్ నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం పేరుతో వచ్చే వెల్ఫేర్ ఫండ్ ను తామే ఇస్తామని అమాయకులను మభ్యపెట్టి వారి మొబైల్ నంబర్లకు ఫేక్ లింకులను పంపిస్తున్నారు. ఈ లింకులను టెక్ట్స్ మెసేజ్ రూపంలో బాధితులకు పంపిస్తున్నారు.

ఇది నిజమేమోనని నమ్ముతున్న బాధితులు చాలామంది ఆ లింకులను క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి యోజన కింద పెన్షన్ డబ్బులు ఇస్తామని మెసేజ్ రూపంలో ఒక లింక్‌ను బాధితులకు పంపిస్తున్నారు. అవి క్లిక్ చేసిన వెంటనే ఒక ఓటిపి వస్తుంది చెప్పమని బాధితుడిని నేరస్థుడు అడుగుతాడు. తమ ఖాతాలో డబ్బు జమ అవుతుందని నమ్మిన బాధితుడు యథేచ్ఛగా ఆ ఓటిపిని నేరస్తుడితో పంచుకుంటున్నాడు. ఓటిపి వచ్చిన వెంటనే బాధితుడు ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని నేరస్తుడు కాజేస్తున్నారు. తీర విషయం తెలుసుకున్న బాధితుడు మోసపోయానని గ్రహించి అప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్‌లతో వచ్చే మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలాంటి మెసేజ్‌లు వస్తే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫేక్ కాల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

About Kadam

Check Also

AP Inter Exam Schedule: మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ఇంటర్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల

ఏపీ ఇంటర్మీడియేట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *