Cyclone Fengal: తుఫాన్ ఉగ్రరూపం.. అమ్మబాబోయ్.! ఏపీలో ఈ ప్రాంతాల్లో వానలు దంచుడే

ఫెంగల్‌ తుఫాన్‌ దూసుకొస్తోంది. గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతుంది తుఫాన్. ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

నైరుతి బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిమీ వేగంతో కదులుతోంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 150 కి.మీ, చెన్నైకి 140 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. సాయంత్రానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయంది.

తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్‌కు అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్.

మరోవైపు ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడు వణికిపోతోంది. భారీవర్షాలతో చెన్నై సహా ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. పాఠశాలలకు, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చారు. ఇప్పటికే కురుస్తున్న భారీవర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. తమిళనాడు, ఏపీని భయపెడుతున్న ఫెంగల్‌ తుఫాను ఇవాళ మధ్యాహ్నం మహాబలిపురం- కారైకల్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని IMD హెచ్చరించింది. తుఫాను ధాటితో చెన్నైలో సబ్‌వేలు, అన్ని బీచ్‌లు, పార్కులను మూసేశారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.

About Kadam

Check Also

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

110 మంది పోలీసులు, 11 బ్రృందాలు 24 గంటలు పని చేస్తే కేసును ఛేదించడానికి ఏడు రోజులు సమయం పట్టింది.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *