గుజరాత్‌ గిఫ్ట్‌ సిటీలో సైప్రస్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటు! ప్రధాని మోదీ హర్షం

ప్రధానమంత్రి మోదీ సైప్రస్ పర్యటనలో భాగంగా, గుజరాత్‌లోని GIFT సిటీలో సైప్రస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), సైప్రస్ ఎక్స్ఛేంజ్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఇది GIFT సిటీని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మరింత బలోపేతం చేస్తుంది.

గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో సైప్రస్‌ స్టాక్‌ఎక్స్చేంజ్‌ ఏర్పాటు అవుతోంది. ఈ మేరకు మన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌కు, టర్కీ ఎక్స్చేంజ్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. సైప్రస్‌లో పర్యటించిన ప్రధాని మోదీ, ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. సైప్రస్‌లో జరిగిన బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఈ అంశం గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గిఫ్ట్‌ సిటీ ఒక అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ అన్నారు.

రెండు దేశాల ఆర్థిక సంబంధాలు బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్‌-సైప్రస్‌ మధ్య ఆర్థిక రంగంతోపాటు, పలు రంగాల్లో పరస్పర సహకారం పెంపొందాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. భారత్‌-సైప్రస్‌-గ్రీస్‌ కలిసి వ్యాపార, పెట్టుబడుల కౌన్సిల్‌ ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతిస్తుంచారు. గిఫ్ట్‌ సిటీలో సైప్రస్‌ స్టాక్‌ఎక్స్చేంజ్‌ ఏర్పాటు కోసం ఒప్పందం చేసుకోవడానికి సహకరించిన ప్రధాని మోదీకి నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ CEO ఆశిష్‌ చౌహాన్‌ ధన్యవాదాలు తెలిపారు.

About Kadam

Check Also

6జీ వచ్చేస్తుందోచ్.. ఆకాశమే హద్దుగా సిగ్నల్స్.. IIT హైదరాబాద్ ఘనత..!

IIT హైదరాబాద్ మరో ఘనత సాధించింది. 7 GHz బ్యాండ్‌లో 6G ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఇది 6G టెక్నాలజీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *