చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు… నిండుగుండెలు నిలువునా ఎండిపోతున్నాయి. ఉన్నపళంగా ఊపిరి ఆగిపోతోంది… ఇక్కడ అంబులెన్సుల్లేవ్… హాస్పిటల్ ట్రీట్‌మెంట్లూ లేవు. కళ్ల ముందే జీవితాలు ఆవిరైపోతుంటే కళ్లు తేలేస్తున్నాం… తప్ప ఏమీ చెయ్యలేని అచేతనావస్థ మనది. తాజాగా తెలంగాణలో మళ్లీ అలాంటి కేసు వెలుగుచూసింది.
పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. ఎలాంటి సమస్యలు లేకపోయినా.. మనిషి ప్రాణాలు క్షణాల్లో ఆవిరైపోతున్నాయి. అప్పటి వరకూ ఎంతో యాక్టివ్‌గా ఉన్నా అంతలోనే కుప్పకూలిపోతున్నారు. హార్ట్.. స్ట్రోక్.. ఈ పేరు వింటేనే.. గుండె వేగం పెరిగితోంది. రక్తం చిక్కబడినా.. రక్తం గడ్డకట్టినా.. గుండె ఆగిపోయినట్టే. ఆ జీవి ప్రయాణానికి ఎండ్ కార్డ్ పడినట్టే. పూర్తి ఫిట్‌గా ఉన్నా.. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కదా అని.. హ్యాపీగా ఉండటానికి లేదు. ఉరుకులు.. పరుగుల జీవితంలో ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉందో అర్ధం కావడం లేదు. ఎందుకంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్లు కూడా క్షణాల్లో కింద పడిపోతున్నారు. నిముషాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా కూతురు పెళ్లి జరుగుతుండగానే అదే మండపంలో తండ్రి హార్ట్ అటాక్‌తో కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమయిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ షాకింగ్ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కుడిక్యాల బాల్‌చంద్రం(56) తన పెద్ద కుమార్తె పెళ్లిని శుక్రవారం జంగంపల్లి శివారులోని బీటీఎస్ వద్ద ఉన్న కల్యాణమండపంలో ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకకు బంధు మిత్రులంతా హాజరయ్యారు. అయితే వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాల్ చంద్ర పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. హార్ట్ అటాక్‌తో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పెళ్లింట విషాదం నెలకుంది.