పార్శిల్‌లో డెడ్‌బాడీ కేసు: అసలు హంతకుడు అతడే! వదిన ఆస్తి కోసం మరిది దారుణం

పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపిన చెక్క పెట్టెలో డెడ్ బాడీ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. వదిన ఆస్తిపై కన్నేసిన మరిది.. డెడ్ బాడీ సాయంతో బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరగడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధంలేని ఓ కూలి ఇతగాడి పన్నాగానికి బలై శవమయ్యాడు..

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెక్కపెట్టెలో గుర్తు తెలియని మృతదేహం పార్శిల్‌ వచ్చిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మృతదేహం కాళ్ల గ్రామానికి చెందిన బర్రె పర్లయ్యది (45) గా పోలీసులు అనుమానిస్తున్నారు. డీఎన్‌ఏ టెస్ట్ అనంతరం ఈ విషయాన్ని నిర్ధారించనున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్‌వర్మ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..

తిరుమాని శ్రీధర్‌వర్మకు.. మృతుడిగా అనుమానిస్తున్న పర్లయ్యకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, కూలీగా జీవనం సాగించే వ్యక్తిని రెండ్రోజులు పని చేయాలని పిలిపించి, పర్లయ్య పీకకు నైలాన్‌ బిగించి కిరాతకంగా హత్య ఎందుకు చేశాడనే ప్రశ్న తొలుస్తుంది. గత గురువారం సాయంత్రం చెక్క పెట్టెలో శవాన్ని బట్వాడా చేసిన సంఘటనలో శ్రీధర్‌ వర్మ నివాసముంటున్న ఇంటి వద్దే బర్రె పర్లయ్య(45) అదృశ్యమయ్యాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎవరీ పర్లయ్య?

బర్రె పర్లయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. వారి మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. కనీసం మాటలు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. పర్లయ్య గతంలో లారీ డ్రైవర్‌గా పని చేసేవాడు. కుటుంబ సమస్యలతో మానసికంగా కుంగిపోయిన పర్లయ్య.. మద్యం అలవాటుపడ్డాడు. దీంతో గాంధీనగరంలోనే రోజంతా కష్టపడి వచ్చినదానితో కడుపు నింపుకుని, పనికి పిలిచినా వారి ఇంటి వద్దే ఆ రాత్రి గడిపేవాడు. మిగతా రోజుల్లో ఇతనికి సొంతిల్లు లేకపోవడంతో పర్లమ్మ ఆలయం వద్దే నిద్రించేవాడు. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉంటున్న పర్లయ్యపై శ్రీధర్‌వర్మ కన్నుపడింది. పని నిమిత్తం ఇంటికి పిలిచి హతమార్చాడు.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *