జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారంగానే ఉద్యోగ నోటిఫికేషన్లు.. డిప్యూటీ సీఎం భట్టి

రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే విద్యా సంవత్సరానికి కూడా సర్కార్ ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు విభాగాలు, శాఖల్లో ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి.. ఆ ప్రకారంగానే టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరక ఉఆయన శాసన మండలిలో మాట్లాడారు. ప్రశ్నపత్రాల లీక్‌, మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, కాంగ్రెస్‌ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలను ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశామని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారమే దశలవారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకాలు చేపడతామన్నారు. అలాగే జాబ్‌ క్యాలెండర్‌ మేరకు నోటిఫికేషన్లు సైతం విడుదల చేస్తామని, అందులో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు.

‘కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణను పునఃప్రారంభించాలి’ సీఎం చంద్రబాబుకు ఐకాస ఛైర్మన్‌ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు రెగ్యులరైజేషన్‌ అంశాన్ని వెంటనే పరిష్కరించాలని సీఎం చంద్రబాబుకు కాంట్రాక్టు లెక్చరర్ల ఐకాస ఛైర్మన్‌ కుమ్మరకుంట సురేష్, కోఛైర్మన్‌ కల్లూరి శ్రీనివాస్‌లు వినతిపత్రం సమర్పించారు. చట్టం-30/2023ను అనుసరించి జీవో114 అమలుతో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొంత మేరకు మాత్రమే పూర్తయిందని, దీన్ని పునఃప్రారంభించి అందరినీ క్రమబద్ధీకరించాలని వీరు వినతి పత్రం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

అంతేకాకుండా కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు వివరాలన్నీ నిధి పోర్టల్‌లో ఉన్నాయని, ఆయా శాఖాధిపతుల లాగిన్‌ నుంచి ఆర్థిక శాఖకు చేరే దశలో న్యాయసలహా కోరుతూ ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌కు దస్త్రం కూడా సమర్పించారని పేర్కొన్నారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్‌ రావడంతో ప్రక్రియ నిలిచిందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా పని చేస్తున్న వారి పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న మే నెల వేతనం కూడా విడుదల చేయాలని ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

About Kadam

Check Also

తేజ్‌ నేను ఎవరితో మాట్లాడలేదురా.. నా కొడుకును మంచిగా చూసుకో.. ఇల్లాలు బలవన్మరణం

కేశవపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తాడికల్‌కు చెందిన 27ఏళ్ల గొట్టె శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *